UP girl raped & killed, cops forced family to cremate midnight బులంద్‌షహర్‌లో మరో హత్రాస్‌ తరహా ఘటన.. కిడ్నాప్, లైంగికదాడి

Rape murder forced the family to perform last rites around midnight bulandshahr rape case

Hathras incident in Bulandshahr, Backward Caste girl, gang rape, Brahmin man, Saurabh Sharma, abducted, gang-raped, BJP Minister, Anil Sharma, police forcible cremation, Midnight final rites, Hathras gang rape case, Tamancha, whatsapp, Dharau village, Bulandshahr, Uttar pradesh, crime

The girl’s family has claimed that she was abducted, gang-raped, and killed by a group of Brahmin men — allegedly protected by the local MLA, Anil Sharma of BJP, a minister in the state government. According to the family, the police forcibly cremated the body in the dead of night in Dharau, a village in Bulandshahr, Uttar Pradesh, in an incident that evokes the Hathras gang rape and murder case of 2020.

బులంద్‌షహర్‌లో మరో హత్రాస్‌ తరహా ఘటన.. కిడ్నాప్, లైంగికదాడి

Posted: 02/02/2022 06:24 PM IST
Rape murder forced the family to perform last rites around midnight bulandshahr rape case

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రోగడంతో పాటు మరి కొన్ని రోజుల వ్యవధిలో తొలి విడత ఎన్నికలకు కూడా రంగం సిద్దమైనా.. రాష్ట్రంలో మాత్రం అత్యాచారాల పర్వం కొనసాగుతూనే వున్నాయి. దళిత మహిళలు, యువతులపై జరుగుతున్న అత్యాచార ఘటనలను వ్యతిరేకించడంతో పాటు బాధిత కుటుంబాలకు తగు న్యాయం జరగాలని డిమాండ్ తో పాటు మహిళలకు, యువతులకు అండగా నిలుస్తామని ఎన్నికల రణక్షేత్రంలో బరిలో అదే ప్రచారాస్త్రాంగా చేసుకన్నా.. అత్యాచార ఘటనలు మాత్రం అగడం లేదు. హత్రాస్‌ హృదయ విదారక ఘటనలో దోషులకు శిక్ష పడక ముందే.. బులంద్ షహర్లో అచ్చం అదే తరహాలో మరో కేసు ఒకటి వెలుగు చూసింది.

పొలం పనులకు వెళ్లిన ఓ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. అదే రాత్రి పోలీసులు ఆమె కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాన్ని ఖననం చేపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జనవరి 21 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్‌షహర్-అలీఘర్ సరిహద్దులోని దిబాయి-ఘలిబ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జనవరి 21 న జరిగింది. ధోరౌ గ్రామానికి చెందిన నలుగురు సదరు బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడి జరిపి, అనంతరం తుపాకీతో కాల్చి చంపారు. ఆమె కుటుంబసభ్యులకు స్థానిక పోలీసులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఘర్షణ పెంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని, వెంటనే దహనం చేయాలంటూ తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో అదే రోజు రాత్రి కాల్చివేసినట్లు బాధితురాలి కుటుంబీకులు చెప్పారు. అయితే, స్థానిక పోలీసులు, అధికారులు బెదిరింపులకు పాల్పడి కేసు బయటకు రాకుండా అణగదొక్కారు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి హత్యకు గురైందని పత్రికలకు కథనం కూడా చెప్పించారు. బాలుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా నమ్మించారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారంటూ బాధితురాలి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠియించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles