Electric Scooty's Battery Explodes In Chintal మళ్లీ పేలిన ఈవీ స్కూటర్ బ్యాటరీ.. కుత్బుల్లాపూర్ లో ఘటన..

Electric scooty s battery explodes during charing in qutbullahpur

Electric Vehicles, fuel prices, EV owners, electric Scooty. battery explode, Bhagat Singh Nagar, Chintal, Sai Kumar, Qutbullahpur, Hyderabad, Telangana, Crime

With the rising fuel prices, Electric Vehicles usage is rapidly increasing but then, pushing the EV owners into a dilemma, an electric Scooty battery exploded in Chintal. No casualties were reported in the accident. Sai Kumar hails from Chintal, Bhagat Singh Nagar, and has been renting an electric scooter for 150 Rupees a day.

మళ్లీ పేలిన ఈవీ స్కూటర్ బ్యాటరీ.. కుత్బుల్లాపూర్ లో ఘటన..

Posted: 02/02/2022 05:26 PM IST
Electric scooty s battery explodes during charing in qutbullahpur

ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వంద రూపాయల మర్కును ధాటిన నేపథ్యంలో అనునిత్యం వాహనాలపై తిరిగి వ్యవహారాలను చక్కబెట్టుకునే వారి నుంచి డబ్బులను పోదుపు చేయాలని భావిస్తున్నవారందరూ తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలతో తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాదులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ నుంచి దట్టమైన పోగలు వచ్చి ఆ వెంటనే మంటలు ఎగసిపడిన ఘటన తెలిసిందే. ఆ తరువాత దేశరాజధాని ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఓ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఇంట్లోని 60 ఏళ్ల వ్యక్తి మరణించగా, అకస్మాత్తుగా అంటుకున్న మంటలలో చిక్కుకున్న నలుగురు కుటుంబసభ్యులు గాయాలపాలైన ఘటన కూడా తెలిసిందే.

అయితే ఇవేదో యాధృశ్చికంగా జరిగిన ఘటనలు అని తోసిరాజుతున్న తరుణంలో కుత్బుల్లాపూర్ స‌ర్కిల్ ప‌రిధిలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ చార్జీంగ్ పెట్టిన క్రమంలో పేలిపోయింది. అకస్మాత్తుగా వ్యాపించిన మంటలతో ఆ గదిలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింత‌ల్ భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎల‌క్ట్రిక్ స్కూటీ బ్యాట‌రీ చార్జింగ్ పెట్టగా అర్థారాత్రి సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. బ్యాట‌రీ పేలిన స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాల్లోకి వెళ్తే.. భ‌గ‌త్‌సింగ్ న‌గ‌ర‌కు చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్య‌క్తి ఇటీవ‌లే ఓ ఎల‌క్ట్రిక్ స్కూటీని కిరాయికి తీసుకున్నాడు.

ప్ర‌తి రోజు రూ. 150 చెల్లించి ఆ స్కూటీని సాయి న‌డుపుకుంటున్నాడు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి త‌న ఇంట్లోని ఓ గ‌దిలో స్కూటీకి ఛార్జింగ్ పెట్టి నిద్ర‌లోకి జారుకున్నాడు. బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ఏవో విద్యుత్ తీగ‌లు కాలిన‌ట్లు వాస‌న రావ‌డంతో సాయికి మేల‌కువ వ‌చ్చింది. ఆయ‌న లేచి ప‌క్క గ‌దిలోని స్విచ్‌ను ఆన్ చేసేలోపే స్కూటీ బ్యాట‌రీ పేలిపోయింది. దీంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఆ ఇంట్లోని సామాగ్రి కాలి బూడిదైంది. అప్ర‌మత్త‌మైన స్థానికులు కిటికీల నుంచి నీళ్లు చ‌ల్లి మంట‌ల‌ను అదుపు చేశారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బ్యాట‌రీ పేలిన స‌మ‌యంలో ఆ గ‌దిలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles