SBI won’t hire pregnant women ఎస్బీఐ బ్యాంకుకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

Sbi revises recruitment rules for pregnant women candidates

sbi recruitment rules for pregnant candidates, state bank of india (sbi), all india state bank of india employees association, SBI, recruitment norms, pregnant women, temporarily unfit, three months pregnancy, Delhi women commission, Reserve Bank of India

The country's largest lender State Bank of India (SBI) has put in place new rules wherein a woman candidate with more than three months pregnancy will be considered "temporarily unfit" and can join the bank within four months after delivery. The move has elicited criticism from some quarters, including from the All India State Bank Of India Employees' Association.

ఎస్బీఐ కొత్త రూల్స్‌.. బ్యాంకుకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

Posted: 01/29/2022 03:49 PM IST
Sbi revises recruitment rules for pregnant women candidates

గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి దేశ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గర్భధారణకు సంబంధించిన సవరణ గతంలో మార్గదర్శకత్వాన్నికి పూర్తి భిన్నంగా ఉంది. గతంలో గర్భం దాల్చిన ఆరు నెలల వరకు మహిళా అభ్యర్థులను బ్యాంకులో నియమించుకోవచ్చని పేర్కొంది, అయితే అందుకుగాను గైనకాలజిస్ట్ నుంచి ఓ ఉత్తరాన్ని సదరు ఉద్యోగులు పోందుపర్చాల్సి వుండేంది.

బ్యాంకు ఉద్యోగాన్ని చేపట్టడం వల్ల సదరు గర్భం దాల్చిన ఉద్యోగి.. పిండం సాధారణ ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కలిగించే అవకాశం లేదని, లేదా ఆమె గర్భస్రావం అయ్యే అవకాశం లేదని లేదా ఆమెపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేదని స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ నుండి ఉద్యోగిని ధృవీకరణ పత్రం తీసుకుని బ్యాంకు అధికారులకు సమర్పించాల్సి ఉండేది. అయితే ఈ వివక్షతను 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మేరకు సవరణలు తీసుకువచ్చారు. కేరళలోని మహిళా సంఘాల వినతిమేరకు నిబంధనలను సవరిస్తూ.. ఇకపై గర్బణీ మహిళాల బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లో, పదోన్నత విషయంలో వైకల్యంగా పరిగణించరాదని అదేశాలు జారీ చేశారు.

కాగా తాజాగా తభిన్నమైన అదేశాలను ఎస్బీఐ జారీ చేసింది. తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్‌ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్‌బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్‌బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్  కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles