Mother Hen Fights Off Snake To Protect Her Chicks వైరల్ వీడియో: విషనాగుతో కలబడింది.. తన బిడ్డలను కాపాడుకుంది..

Viral video mother hen fights off snake to protect her chicks what happens next

Chicken Fights Off Snake, mother hen, Chicken, hen, snake, Venomous Reptile, fight, children, mothers love, mother, Chicks, viral video

Snakes are scary creatures and no matter the size or breed, any encounter with them is terrifying. A similar video has emerged on social media, wherein a mother hen fights a fierce battle with a cobra to save her chicks. In the video, it can be seen that the hen is sitting on its eggs, when a black snake approaches its nest.

ITEMVIDEOS: ఓ తల్లి పోరాటం: విషనాగుతో కలబడింది.. తన బిడ్డలను కాపాడుకుంది..

Posted: 01/29/2022 04:40 PM IST
Viral video mother hen fights off snake to protect her chicks what happens next

ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది మాతృత్వం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి తల్లులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. మాతృత్వం ఏ జీవికైనా వరం.. అయితే దీనిని నిలుపుకునేందుకు ఎంతవరకైనా వెళ్లడమే కాదు.. పుట్టిన బిడ్డలను కూడా పెంచి పెద్ద చేసేందుకు వారు ఎంత వ్యయప్రయాసలకైన ఓరుస్తారు. తమ బిడ్డలకు ముప్పు పొంచి వుందని తెలిస్తే.. ఏకంగా తమ ప్రాణాలను కూడా పన్నంగా పెట్టి బిడ్డలను కాపాడేది తల్లి. అది మనిషైనా, జంతువైనా, పక్షి అయినా తల్లి మనసు మాత్రం ఒక్కటే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. తాను పొదుగుతున్న గుడ్లను కాపాడుకోవడానికి తల్లి కోడి ఏకంగా నల్లత్రాచుతోనే పోరాడింది.

అసలేం జరిగిందంటే... ఒక తల్లి కోడి తన గుడ్లను పొదుగుతోంది. ఇంతలోనే ఓ నల్లత్రాచు అక్కడకు వచ్చింది. గుడ్లను తినేందుకు యత్నించింది. అయితే, తల్లి కోడి మాత్రం ఏమాత్రం భయపడలేదు. తన గుడ్లను సంరక్షించుకునే క్రమంలో కనీసం ఒక ఇంచు కూడా పక్కకు జరగలేదు. అంతేకాదు, పడగవిప్పి బుసలు కొడుతున్న త్రాచు కళ్లలోకి కళ్లు పెట్టి చాలా తీక్షణంగా చూసింది. ఇంతలోనే ఆ కోడిని కాటు వేసేందుకు పాము ప్రయత్నించగా... దాని పడగపై కోడి దాడి చేసింది. పాము, కోడి ఫైట్ ఉత్కంఠభరితంగా సాగింది. కోడి పట్టుదలను, సాహసాన్ని చూసి పాము చివరకు తోకముడిచి, అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ కోడి అమ్మ మనసుకు, ధైర్యానికి నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by hayatvahsh2019 (@hayatevahsh_2019)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles