హరిద్వార్, ఢిల్లీ వేదికగా జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష పూరిత ప్రసంగాలు చేయడంతో పాటు ఓ వర్గానికి చెందినవారిని ఎదుర్కోవడంలో అవసరమైతే అయుధాలను వాడాలని, వారిపై మారణహోమం సృష్టించాలని వ్యాఖ్యలు చేసిన హిందూ ధర్మ సంసద్ వక్తలను ఎందుకు అరెస్టు చేయలేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్రప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసి.. పది రోజుల వ్యవధిలో నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని అదేశించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ధర్మసంసద్ పేరుతో నిర్వహించిన మతవాద సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులతో ఇవాళ అరెస్టు చేశారు. వ్యక్తుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ధర్మ సంసద్‌లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ వసీం రిజ్వి అలియాస్ జితేంద్ర త్యాగి త్యాగి, యతి నరసింహానందను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. విపక్షాలన్నీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
ధర్మ సంసద్ వేదికగా ముస్లింలపై జితేంద్ర నారాయణ్ త్యాగి విద్వేష పూరిత ప్రసంగం చేశారంటూ గుల్బర్ ఖాన్ అనే వ్యక్తి హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. యతి నరసింహానంద ఆధ్వర్యంలో డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్‌లో ధర్మ సంసద్ జరిగింది. ఈ సందర్భంగానే ఓ వర్గంపై వీరు విద్వేష పూరిత ప్రసంగాలు చేశారు. మరోవైపు ధర్మ సంసద్‌లో వీరు చేసిన ప్రసంగాలకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు జితేంద్ర త్యాగితో సహా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. హిందూ నేతలు ఇలాంటి ప్రసంగాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more