తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అనేక మంది నేతలు చాలా విధాలుగా చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. అయితే సినీ పరిశ్రమలో మొత్తంగా నెలకొన్న సమస్యను సవివరణంగా వివరించే ప్రయత్నం కూడా అసంపూర్తిగా జరిగింది. దీంతో ఎట్టకేలకు పండగ పూట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా సినిఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని లంచ్ సమావేశానికి పిలిపించారు. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. కాగా అవకాశం లభించడంతో సినీపరిశ్రమలోని ప్రతీఒక్కరి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు చిరంజీవి. సినిమా థియేటర్ల యజమానులు, టికెట్ ధరలు, ఎగ్జిబిటర్ల సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, నిర్మాతల పరిస్థితులు, సినీ కార్మికులు, ఇలా అన్ని వివరించారు.
కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్ తో చాలా సంతృప్తిగా జరిగిందని.. త్వరలోనే (రెండు మూడు వారాల్లోగా) చక్కని శుభవార్త వింటామని అన్నారు. పండగ పర్వదినం చోజున సీఎం జగన్ తో సమావేశం జరగడం.. తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించే శుభపరిణామానికి దారితీస్తుందని, చక్కటి శుభవార్త కోసం తెలుగు సినీపరిశ్రమతో పాటు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పుకోచ్చారు. గత ఏప్రిల్ నుంచి సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న కొన్ని తర్జనభర్జనలకు సమాధానం త్వరలోనే దొరుకుతుందని చెప్పారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు.
అలాగే జగన్ తీసుకున్న నిర్ణయాలతో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను కూడా జగన్కు వివరించినట్లు వెల్లడించారు. అయితే సినిమా టికెట్స్ విషయంపైనే ముఖ్యంగా అంతా చర్చించుకున్నారు. అసలు ఈ విషయం గురించి జగన్ ఏం అన్నాడు అనేది అందరికీ కావాలి. కానీ దీనిపై ఏపీ సీఎం ఏదీ తేల్చి చెప్పలేదని చిరంజీవి చెప్పాడు. టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని మాత్రం జగన్ చెప్పినట్లు మెగాస్టార్ తెలిపారు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించాడు. ఇండస్ట్రీలో బయటకు కనిపించేంత గ్లామర్ లేదని.. ఇక్కడ రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు ఉంటారని.. వాళ్ల పరిస్థితి గురించి కాస్త ఆలోచించాలని జగన్ను విజ్ఞప్తి చేసినట్లు చిరు చెప్పాడు.
ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ తెలిపారు. అయితే అన్నీ ఆలోచనలో ఉన్నట్లే మాట్లాడాడు కానీ ఒక్కటి కూడా స్పష్టమైన హామీతో మీటింగ్ నుంచి బయటకు రాలేదు చిరంజీవి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. ఎవరూ భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్పాడు కానీ మీరు ధైర్యంగా ఉండండి.. నేనున్నాను మీకు.. ముందులాగే ఇండస్ట్రీ ఉంటుందనే హామీలు మాత్రం జగన్ ఇవ్వలేదు. అయితే సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని మాత్రం జగన్ చెప్పినట్లు చిరంజీవి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more