సినిమా హీరోలు పోలీసు అధికారుల పాత్రలో నటిస్తే.. దాదాపుగా అన్ని చిత్రాలు హిట్. ఇక తాజాగా సింగం సినిమా ఏకంగా మూడు సీక్వెల్ వచ్చినా.. అన్నీ హిట్ అయ్యాయంటే అందుకు కారణం వారి నటే. అయితే వారు సినిమాల్లో చేసిన నటనను నిజజీవితంలో చేశాడో రియల్ పోలీసు అధికారు. ఓ దొంగను రీల్ పోలీసు తరహాలో వెంబడించి పట్టుకున్నాడు. అలా ఇలా కాదు.. ఏకంగా పరుగెత్తుకుంటూ.. ట్రాఫిక్ రోడ్డు దాటుతూ.. గేటును దూకుతూ.. రోడ్డుపై వాహనాలను దాటుకుంటూ.. వెళ్లి మరీ దొంగను చేధించి పట్టుకున్నాడు. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వీడియో ఏకంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో సదరు పోలీసు అధికారి కూడా హీరోగా మారాడు.
ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం నెహ్రూ గ్రౌండ్ సమీపంలో మొబైల్ ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఇదంతా మొదలైంది. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే మంగళూరు పోలీసులు వరుణ్‌ని వెంబడించి అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రధాన రహదారి, ఇరుకైన దారులు, వీధుల గుండా దొంగను వెంబడించి చివరకు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసు దొంగను పట్టుకుని నేలపై కుదేశాడు. వెంటనే అతని సహచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. నిందితుడి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను చూసిన మంగళూరువాసులు ఇది సినిమా షూటింగా.? లేక నిజంగా చేజింగా.? అన్నది అర్థంకాక షాక్ లో ఉండిపోయారు.
మంగుళూరు నెహ్రూ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న ఒక పోలీసు అధికారి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ARSI) వరుణ్ అల్వా స్థానికంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతలో ఎదో ఘటనను చూసిన ఆయన ఆకస్మికంగా తన కారు నుంచి దిగి దిగగానే పరుగులు తీశాడు. ఏంటీ ఇలా పరుడుపెడుతున్నాడని అక్కవున్నవారితో పాటు అతని సహచరులు కూడా అనుకున్నారు. సదరు పోలీసు అధికారి భవనాలు మధ్యనున్న ఇరుకైన సందుల మీదుగా.. ట్రాపిక్ వెళ్తున్న రోడ్డును దాటి, రద్దీ వీధుల మధ్యనుంచి, నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తిని పట్టుకోవడానికి పరుగులు తీశాడు. ఇంతకీ ఇరుకైన వీధులు, ట్రాఫిక్ రోడ్డును దాటి ఆ నీలిరంగు వ్యక్తిని ఎందుకు చేధించాల్సి వచ్చిందో తెలుసా.?
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి మంగళూరుకు వలస వచ్చిన స్థానిక గ్రనైట్ కంపెనీలో పనిచేస్తున్న వలస కార్మికుడి నుంచి ఫోన్ ను తస్కరించిన ముగ్గురు సభ్యుల ముఠాలో.. నీలిరంగు చొక్క ధరించిన వ్యక్తి కూడా ఓ సభ్యుడు. అయితే వారు తన ఫోన్ తస్కరించగానే గుర్తించిన వలసకార్మికుడు దొంగను పట్టుకునే ప్రయత్నం చేయగానే వారు వేగంగా పరుగెత్తి తప్పించుకున్నారు. ఈ ఘటనను విదులు నిర్వహిస్తున్న ఎస్ఐ వరుణ్ అల్వా చూశాడు. వెంటనే దొంగను చేధించి పట్టుకున్నాడు. దొంగను 32 ఏళ్ల హరీష్ పూజారిగా గుర్తించారు, నెహ్రూ గ్రౌండ్స్‌లో నిద్రిస్తున్న వలస కార్మికుడి నుంచి ఫోన్ దొంగలించి పారిపోతుండగా, ఎస్ఐ చేధించి పట్టుకున్నాడు.
ఈ కేసులో మరో నిందితుడు అత్తావర్‌కు చెందిన 20 ఏళ్ల శమంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మరో నిందితుడు రాజేశ్ తప్పించుకున్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుల నుంచి దొంగిలించబడిన శాంసంగ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమ విచారణలో, ముగ్గురు సభ్యుల ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడతున్నట్లు తేలిందని తెలిపారు. ఈ మేరకు పాండేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా విధుల నిర్వహణలో అలర్ట్ గా వున్న వరుణ్ అల్వాను మంగళూరు పోలీసు కమీషనర్ అభినందించి పదివేల రూపాయల క్యాష్ రివార్డును అందించారు.
Robbery offender cought within 10 mins of offence by chasing him though the city. Hats off to varun Mangalore city police.
— Shashi Kumar CP mangaluru (@ShashiK85532199) January 13, 2022
ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ರಾಬರಿ ಪ್ರಕರಣದ ಆರೋಪಿಯನ್ನು ಮಂಗಳೂರಿನ ಪೊಲೀಸ್ ವರುಣ್ ರವರು ಬೆನ್ನಟ್ಟಿ ಹಿಡಿದಿದ್ದು. pic.twitter.com/SqmzVv77Cj
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more