Called CM over security issue as Modi is PM: Priyanaka ‘మోడీ దేశప్రధాని కాబట్టే..’ సీఎంను అడిగి తెలుసుకున్నా: ప్రియాంక

Priyanka gandhi clarifies she called punjab cm over security breach as modi is desh ka pm

Priyanka Gandhi, Priyanka Gandhi up election, Priyanka Gandhi channi, pm modi security breach, up election 2022, rahul gandhi, Priyanka Gandhi, PM Modi Security breach, Punjab CM, Charanjeet singh Channi, Farmers Protest, BJP, Congress, Punjab Politics

Congress leader Priyanka Gandhi-Vadra has clarified that she called up Punjab Chief Minister Charanjit Singh Channi as she got “worried” after she heard about Prime Minister Narendra Modi’s security breach. Her clarification came after it was reported that Punjab CM Channi briefed Priyanka Gandhi Vadra over PM Modi’s security breach.

‘మోడీ దేశప్రధాని కాబట్టే..’ సీఎంను అడిగి తెలుసుకున్నా: ప్రియాంక గాంధీ

Posted: 01/10/2022 03:13 PM IST
Priyanka gandhi clarifies she called punjab cm over security breach as modi is desh ka pm

 పంజాబ్‌లో ప్ర‌ధాని భ‌ద్ర‌తా విష‌యంలో తలెత్తిన లోపంపై తానే పంజాబ్ సీఎం చ‌న్నీతో తానే మాట్లాడాన‌ని కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి ప్రియాంక గాంధీ వెల్ల‌డించారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ మీడియాకు వివరించిన నేపథ్యంలో బీజేపి నుంచి ఆయనను విమర్శలు చుట్టుముట్టాయి. ప్ర‌ధాని మోదీ పంజాబ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా త‌లెత్తిన వివాదం, అస‌లు ఏం జ‌రిగింది.. వీటిపై కూలంక‌షంగా ఆమెకు వివ‌రించాన‌ని, ప్ర‌ధాని మోదీ భ‌ద్ర‌త‌కు ఎలాంటి ఢోకా కూడా లేద‌ని ప్రియాంక‌తో చెప్పిన‌ట్లు సీఎం చెన్నీ వెల్ల‌డించారు.

దీంతో బీజేపీ నేతలు స‌రిగ్గా ఇదే అంశాన్ని లేవనెత్తి.. ప్ర‌ధాని మోదీ భ‌ద్ర‌త‌కు సంబంధించి సీఎం చెన్నీ.. తమ పార్టీ నేత ప్రియాంక‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది? అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ ఎలాంటి రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో లేర‌ని, అయినా ఆమెకు ప్రధాని గురించి ఎందుకు చెప్పాల్సి వ‌చ్చింద‌ని బీజేపి నేత సంబిత్ పాత్రా సూటిగా నిల‌దీశారు. దీంతో చన్నిపై విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలో స్పందించిన ప్రియాంక.. తానెలాంటి రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో లేన‌ని, అయితే ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు సంబంధించి టీవీల్లో వ‌స్తున్న ఘ‌ట‌న‌ను చూసి, కాస్త ఆందోళ‌న‌కు గురయ్యాన‌ని అన్నారు.

ప్రధాని మోడీ పర్యటనలో భద్రత అంశంలో అసలు జరిగిందేమిటీ.? అని ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి సీఎంను అడిగి తెలుసుకున్నా. ఓ సహచరి మాదిరిగానే సీఎం చ‌న్నీకి ఫోన్ చేసి, వివ‌రాలు తెలుసుకున్నాన‌ని ప్రియాంక స్ప‌ష్టం చేశారు. ‘నేనే స్వ‌యంగా పంజాబ్ సీఎం చెన్నీతో మాట్లాడా. నేను ఏ రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలోనూ లేను. అయితే ప్ర‌ధాని భ‌ద్ర‌త‌కు సంబంధించి టీవీ చాన‌ళ్ల‌లో వ‌స్తున్న వార్త‌ల‌ను చూసి ఆందోళ‌న చెందా. అందుకే ఈ సీఎం చెన్నీకి ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నా. ఓ విష‌యాన్ని ఎవ్వ‌రూ మరిచిపోవ‌ద్దు.. ప్ర‌ధాని మోదీ ఈ దేశ ప్ర‌ధాని’ అని ప్రియాంక అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles