ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో రెండో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న దేశరాజధాని ఢిల్లీలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈక్రమంలో ఢిల్లీ సర్కార్ అక్కడ మరిన్ని ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. వారంతపు కర్ప్యూతో పాటు రాత్రివేళ కూడా కర్ప్యూను అమల్లోకి తీసుకువచ్చింది. అయినా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఇక మరిన్నీ అంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఒమిక్రాన్ ను నియంత్రించాలని రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తోంది. అయినా ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో ఇక తాజాగా రెస్టారెంట్ల లోనూ కేవలం టేక్ అవేలకు మాత్రమే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఇకపై రెస్టారెంట్లు, హోటళ్లలో కూర్చోని తినడానికి వీలు లేదని పేర్కోంటూ కొత్త అంక్షలను విధించింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఢిల్లీ విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రజలు ఒకే చోట గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి మరింత వేగంగా జరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్కార్ హోటల్స్‌లో కూర్చొని తినడంపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైపోయింది.
ఇదిలావుండగా, ఢిల్లీ హోంశాఖలోనూ కరోనా మరింతగా విజృంభిస్తోంది. అత్యైక పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యి మంది పోలీసులకు కరోనా బారిన పడ్డారని తాజాగా సమాచారం అందుతోంది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాగా.. దీంతో దాదాపు వెయ్యి మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అదనపు కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్ కూడా కరోనా బారిన పడిన వారిలో ఉన్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. కరోనా సోకిన సిబ్బంది అంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కేవలం 24 గంటల్లోనే ఢిల్లీలో 22 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more