Coronavirus: GHMC Records 1,452 New Cases తెలంగాణలోనూ కరోనా వేగం.. జీహెచ్ఎంసీలో 15 వందల కేసులు..

India logs 1 41 lakh new covid 19 cases 21 3 higher than yesterday omicron tally reaches 3 071

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

India registered 1,41,986 new Covid-19 cases in the last 24 hours, 21.3 per cent higher than yesterday, according to the data shared by the Union Health Ministry. The total caseload in the country stands at 3,53,68,372. Top five states which have registered maximum cases are Maharashtra with 40,925 cases, followed by West Bengal with 18,213 cases, Delhi with 17,335 cases, Tamil Nadu with 8,981 cases and Karnataka with 8,449 cases.

దేశంలో మళ్లీ కరోనా ప్రమాద గంటికలు.. లక్షన్నరకు చేరువలో కేసులు

Posted: 01/08/2022 11:39 AM IST
India logs 1 41 lakh new covid 19 cases 21 3 higher than yesterday omicron tally reaches 3 071

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ తో కూడిన మూడవ దశ ముపు ప్రమాద గంటికలు మ్రోగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసులు ఏకంగా లక్షన్నర మార్కుకు చేరువలో నమోదు అయ్యాయి. జనవరి 1వ తేదీన 27,553 కేసులు నమోదు కాగా, అందులో కేవలం 309 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని కేంద్ర అరోగ్య మంత్రిత్వశాఖ గణంకాలు వెల్లడించాయి. ఇక వారం రోజుల వ్యవధిలో కొత్త కరోనా కేసులు ఏకంగా లక్షన్నర మార్కుకు చేరకున్నాయి. ఇక ఇందులో దాదాపుగా మూడు వేలకు పైగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులేనని వైద్య నిఫుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా బాధితులందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించడం కుదరకపోవడంతో.. సేకరించిన నమూనాల ఆదారాంగా ఏకంగా కొత్త కేసులలో 70శాతం మేర కేసులు నమోదవుతున్నాయని వైద్యవర్గాలు అంచనావేస్తున్నాయి. క్రితం రోజున 15 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, ఏకంగా లక్షా నలబై రెండు వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 9.28కి చేరుకుంది. ఇది వైద్యనిపుణులను అందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలో కరోనా ఉధ్దృతంగా వ్యాప్తి చెందడం పట్ల కలవరం చెందుతున్న నిపుణులు దేశ ప్రజలు కరోనా నియంత్రణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఒక్క మహారాష్ట్రలో 40 వేల కేసులు నమోదు కాగా.. అందులో ముంబైలో వెలుగు చూసిన కేసుల సంఖ్యే 20,971గా నమోదైంది. పశ్చిమ బెంగాల్ లో 18 వేలు, ఢిల్లీలో 17 వేల కేసులు బయటపడ్డాయి. మిజోరంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి చేరింది. ఒమిక్రాన్ బారిన పడిన మొత్తం 3071 రోగులలో 1203 మంది రోగులు చికిత్స పోందిన తరువాత కొలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్యవర్గాలు వెల్లడించాయి. కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో మహారాష్ట్రలో అత్యధికంగా 876 మంది ఉండగా, ఢిల్లీలో 513 మంది వున్నారని కేంద్రం విడుదల చేసిన గణంకాలు స్పష్టంచేస్తున్నాయి.

ఇక ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు వేగాన్ని అందుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు వేల మార్కును చేరుకోగా, కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 1500 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో మొత్తంగా 2,295 కొత్త కేసులు నమోదుకాగా, ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడి మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి చికిత్స పోందుతూ నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles