Merck says no safety concerns observed in molnupiravir phase-3 trial కరోనా ‘మెల్నుఫిరవిర్’ మాత్రల సైడ్ ఎఫెక్ట్స్ పై ఫార్మా కంపెనీ స్పందన

Merck says no safety concerns observed in molnupiravir phase 3 trial shared relevant data with dcgi

Molnupiravir, covid drug, COVID-19, coronavirus, oral anti- COVID pill, major safety concerns, Dr Balaram Bhargava, serious side effects, congenital disorders, teratogenicity, mutagenicity, cartilage damage, muscles damage, bones damage, lethal mutagenesis, error catastrophe, viral genome, DCGI, USFDA, BDR pharma, Antiviral oral pill for COVID, Coronavirus updates

Merck Sharp & Dohme (MSD) said its COVID antiviral molnupiravir has cut the risk of hospitalization or death in Phase 3 clinical trial with no observed safety concerns when compared to the placebo group. The company said it has provided relevant information as requested to help the DCGI determine the most appropriate use of molnupiravir in India.

కరోనా ‘మెల్నుఫిరవిర్’ మాత్రల సైడ్ ఎఫెక్ట్స్ పై ఫార్మా కంపెనీ స్పందన

Posted: 01/08/2022 12:25 PM IST
Merck says no safety concerns observed in molnupiravir phase 3 trial shared relevant data with dcgi

కరోనా వైరస్ మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఊరటనిచ్చేలా అమెరికా ఎఫ్.ఢి.ఏ అగ్రరాజ్యంలోని కరోనా బాధితులకు చికిత్సకు అనుమతించిన ఓరల్ డ్రగ్ మోల్నుపిరవీర్ ను ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అధికారులు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓరల్ డ్రగ్ వైరస్ ఆర్ఎన్ఐలోకి దూసుకెళ్లి.. అవి వృద్ది చెందకుండా అడ్డుకోవడంలో దోహదపడతాయని పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మందును భారత దేశంలోని 18 ఫార్మా సంస్థలు తయారు చేసేందుకు కూడా ఇప్పటికే అనుమతి పోందడంతో వాటిలో దాదాపు అన్ని కంపెనీలు ఈ మాత్రను భారతీయ విఫణిలోకి కూడా ప్రవేశపెట్టాయి.  

అయితే మోల్నుఫిరవిర్ మందు వినియోగంతో పలు సైడ్ ఎపెక్ట్స్ ఉన్నాయని ఐసీఎంఆర్ రెండు రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసింది. మెల్నుఫిరవిర్ డ్రగ్ తో ముప్పు పోంచి వుందని భారత వైద్య పరిశోధన మండలి చీఫ్ బలరాం భార్గవ అప్రమత్తం చేశారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్లే ఈ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని కూడా చెప్పారు. ఇక ఈ మాత్రలు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

అయితే ఐసీఎంఆర్ లేవనెత్తిన దుష్ప్రభావాలపై మెర్క్ ఇండియా ఫార్మా సంస్థ స్పందించింది. అత్యవసర వినియోగానికి మోల్నుపిరవిర్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసిన తర్వాతి రోజే ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా వుంటాయని.. అయితే కొందరిలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం కూడా చూపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన మెర్క్ ఇండియా ఫార్మా.. మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్ల సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఈ మాత్రల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఫేజ్ 3 ట్రయల్స్‌లో వెల్లడైనట్టు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles