Palvoncha suicide: Victim’s video reveals depravity of accused సంచలనం సృష్టిస్తున్న రామకృష్ణ సెల్పీ వీడియో..!

Palvoncha suicide pact naga ramakrishna s video reveals depravity of accused

vanama raghavender, Family suicide, Telangana police, Abetment of suicide, Vanama Venkateswara Rao, Ramakrishna, Family Suicide, Palwancha suicide case, Raghavender video, family suicide case, Palwancha, Khammam, Telangana, crime

In the Naga Ramakrishna family suicide case, the victim reportedly accused Vanama Raghavendra Rao, son of TRS MLA Vanama Venkateswara Rao, of demanding sexual favours from the family members of the victim in the selfie video that he had shot before taking the extreme step.

ITEMVIDEOS: ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియో.. వనమా రాఘవపై తీవ్ర అరోపణలు

Posted: 01/06/2022 12:19 PM IST
Palvoncha suicide pact naga ramakrishna s video reveals depravity of accused

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఓ కుటుంబం సామూహిక ఆత్యహత్యకు సంబంధించిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే తనయుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ చెబుతున్నా.. పోలీసులు ఆయన చుట్టూ మాత్రం ఉచ్చు బిగించారు. రామకృష్ణ తన భార్య, కూతుళ్లతో సహా ఆత్మహత్య పాల్పడేందుకు వనమా రాఘవానే కారణమని స్వయంగా నాగ రామకృష్ణ పేర్కోనడమే కారణం. అయితే ఇందుకు సంబంధించిన మరణవాంగ్మూలం వీడియోను ఆయన ఆత్మహత్యకు కొన్ని గంటల ముందుగానే రికార్డు చేసిన సెల్పీ వీడియో తాజాగా బయటకువచ్చింది.

తమది రాజకీయ కుటుంబమని.. అనేక మంది అనేక వ్యవహారాలపై తమ ఇంటికి వస్తారని బీరాలు పోయిన వనమా రాఘవ.. నాగ రామకృష్ణకు స్వతహాగా రావాల్సిన తండ్రి ఆస్తిలోని వాటాను నాగ రామకృష్ణ తల్లిని, సోదరిని మచ్చిక చేసుకుని రాకుండా అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించాడని అరోపించాడు. ఇక ఆయనకు తన తండ్రి ఆస్తిలో వాటా రావాలంటే.. తన భార్యను తీసుకుని హైదరాబాద్ కు రావాలని.. అప్పటి వరకు తన సమస్యను తీరదని, ఈ విషయంలో మీరు ఎక్కడ.. ఎవరికి చెప్పుకున్నా తనకు నష్టం లేదని మరీ హెచ్చరించాడని నాగ రామకృష్ణ రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలతో పేర్కోన్నాడు.

ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించిన ఆయన.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగిందని.. ఆందులో బెయిలు పోందని వనమా రాఘవేందర్ రావు మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం.. సామాన్య ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు అని రామకృష్ణ పేర్కోన్నాడు.

ఏ భర్త వినకూడని మాటలను ఆయన నా చెవిన వేశాడు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ తనను రక్షించుకుంటానని, తన ప్రాణలకు, మానానికి రక్షణగా వుంటానని ప్రమాణం చేసిన తాను ఎప్పుడిలాంటి మాటలు వింటానని అనుకోలేదు. ఇక తాను మాత్రమే చనిపోయినా.. వారు ఎలాగో నా భార్య, పిల్లలను వదిలిపెట్టరని.. నా భార్య, పిల్లలను ఏం చేస్తారో.? అన్న భయంతోనే.. తనతో పాటు వారినీ తీసుకెళ్తున్నానని చెప్పుకోచ్చాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వోద్దని నాగ రామకృష్ణ తన సెల్పీ వీడియోలో కోరాడు.

ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తనపై తన తల్లి, సోదరి కక్ష సాధిస్తున్నారని.. వారు ప్రస్తుతం ఎవరి మొప్పుకోసమే చూస్తున్నారు.. కానీ వారికి కూడా వాస్తవాలు తెలియవు.. ఇక తనకు రావాల్సిన వాటాను.. తనకు ఆర్థికంగా సాయం చేసిన మంచి మనుషులకు పంచాలని తన తల్లిని కోరాడు. ఈ సెల్పీ వీడియో తీసిన తరువాత నాగ రామకృష్ణ.. తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. కుమార్తె సాహితి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఈ ఘటనలో తన ప్రమేయం ఉందని నిరూపితమైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించిన వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles