Molnupiravir out of treatment protocol for 'major safety concerns' కరోనా చికిత్సలో ‘మెల్నుఫిరవిర్’ మాత్రల పట్ల ఐసీఎంఆర్ హెచ్చరిక

Covid pill molnupiravir out of national treatment protocol for major safety concerns icmr

Molnupiravir, covid drug, COVID-19, coronavirus, oral anti- COVID pill, major safety concerns, Dr Balaram Bhargava, serious side effects, congenital disorders, teratogenicity, mutagenicity, cartilage damage, muscles damage, bones damage, lethal mutagenesis, error catastrophe, viral genome, DCGI, USFDA, BDR pharma, Antiviral oral pill for COVID, Coronavirus updates

Indian Council for Medical Research (ICMR) has cited 'major safety concerns' for not adding Merck's coronavirus pill, Molnupiravir, to the national treatment protocol. Head of ICMR, Dr Balaram Bhargava, said the US-approved pill has serious side effects for both men and women, which can lead to congenital disorders in their offspring born later.

కరోనా చికిత్సలో ‘మెల్నుఫిరవిర్’ మాత్రల పట్ల ఐసీఎంఆర్ హెచ్చరిక

Posted: 01/06/2022 01:20 PM IST
Covid pill molnupiravir out of national treatment protocol for major safety concerns icmr

కరోనా వైరస్ మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు భయాందోళన చెందకుండా ఊరటనిచ్చేలా అమెరికాకు చెందిన ఎఫ్ ఢిఏ ఆ దేశంలోని కోవిడ్ రోగులకు అనుమతించిన ఓరల్ డ్రగ్ మోల్నుపిరవీర్ ను గతవారం రోజుల క్రితం భారత ఔషధ నియంత్రణ డీసీజీఐ అధికారులు కూడా అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓరల్ డ్రగ్ వైరస్ ఆర్ఎన్ఐలోకి దూసుకెళ్లి.. అవి వృద్ది చెందకుండా అడ్డుకోవడంలో దోహదపడతాయని పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మందును ఎవరు తీసుకోవాలి.. అన్న విషయాన్ని ఇదివరకే డీసీజిఐ సహా ఔషధ సంస్థలు కూడా తెలిపాయి.

అయితే ఇప్పటికే ఈ మందును తయారు చేసేందుకు దేశంలోని 18 సంస్థలు అనుమతిని పోందాయి. ఈ క్రమంలో మ్యాన్ కైండ్ ఫార్మా కీలక అడుగు ముందుకేసి.. తమ కంపెనీ నుంచి ఒక్క వ్యక్తికి కావాల్సిన కోర్సు మాత్రలను విడుదల చేసింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ ‘మోలులైఫ్’ మాత్రల ధరను కేవలం 1399కే అందించనుంది. ఇక ఈ మాత్రలను మ్యాన్ కైండ్ కంపెనీతోపాటు డాక్టర్ రెడ్డీస్, బయలాజికల్ ఇ, హెటిరో, సహా పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. అయితే తాజాగా ఐసీఎంఆర్ ఈ మందు వినియోగంలో హెచ్చరికలు జారీ చేసింది. మెల్నుఫిరవిర్ డ్రగ్ తో ముప్పు పోంచి వుందని భారత వైద్య పరిశోధన మండలి చీఫ్ బలరాం భార్గవ ప్రజలను అప్రమత్తం చేశారు.

మెల్నుఫిరవిర్ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తాయని పేర్కొన్నారు. అంటే ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్లే ఈ ట్యాబ్లెట్లను కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదన్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడిన మహిళలు ఆ తర్వాత మూడు నెలలపాటు గర్భం దాల్చకుండా జాగ్రత్త పడాలని సూచించారు. లేదంటే పుట్టే పిల్లలు పలు సమస్యల బారినపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా, కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles