దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వారం వ్యవధిలో ఐదు రెట్లు పెరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 1700కి చేరాయి. ఇలా దేశంలో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీనికి న్యూ ఇయర్ వేడుకలు మరింత ఆజ్యం పోస్తున్నాయన్నది వాస్తవం. త్వరలోనే ఆ ప్రభావం మరింతగా కనిపించనుందని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పండగ సీజన్‌లో గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఆ వీడియోలో.. ఇసుకేస్తే రాలనంత రద్దీ కనిపించింది. ఆ కిక్కిరిసిన జనంలో కొవిడ్ నియమాలు గాల్లో కలిశాయి. కొత్త సంవత్సరం కావడంతో సేద తీరేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండగా..గోవా ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలు జారీ చేసింది. టీకా ధ్రువపత్రం, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ నివేదిక ఉంటేనే ప్రజల్ని అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాసినోలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల మధ్యనే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు వేల సంఖ్యలో ప్రజలు బీచ్‌లు, నైట్‌క్లబ్స్, పబ్స్‌కు తరలివచ్చారు. దానిలో భాగంగా బాగా బీచ్ సమీపంలో జనాలు కిటకిటలాడారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ కాగా.. కొవిడ్ వేవ్‌ను ఘనంగా స్వాగతిస్తున్నారంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
ఈ కొవిడ్ పరిస్థితుల్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో.. శరవేగంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటున్న ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు హడెలెత్తిస్తున్న నేపథ్యంలో.. ఈ స్థాయిలో పర్యటించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ స్థానిక ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటల వ్యవధిలో గోవాలో 388 కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం ఒక్క ఒమిక్రాన్ కేసు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వేడుకల సీజన్‌తో సోమవారం అక్కడ కొవిడ్ పాజిటివిటీ రేటు 10.7 శాతానికి చేరింది. మొత్తం కేసులు 1.8లక్షలు దాటగా.. 3,253 మంది మరణించారు.
This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO
— HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more