IIT-K Prof says third wave will end in April కరోనా ధర్డ్ వేవ్ పై కాన్సూర్ ఐఐటీ ఆధ్యయనం.. కీలక అంశాల వెల్లడి..

Covid 19 iit kanpur professor says third wave will end in april

covid 19 omicron variant symptoms, iit kanpur, india, south africa, corona, iit professor, scientist, manindra agarwal, election ralies, super spreaders, delta variant, covid 19, omicron symptoms, omicron virus symptoms, omicron variant symptoms and severity, omicron variant symptoms in india, omicron variant symptoms in adults, omicron variant in india, omicron covid cases, latest news on omicron variant, covid 19 new variant omicron symptoms, new covid variant

Professor Manindra Agarwal of IIT Kanpur has said that the third wave of the pandemic will end by April. The scientist, however, warned that rallies during elections can prove to be super spreader for Corona infection, as it is not easy to follow the Covid guidelines in such gatherings.

కరోనా ధర్డ్ వేవ్ పై కాన్సూర్ ఐఐటీ ఆధ్యయనం.. కీలక అంశాల వెల్లడి..

Posted: 01/04/2022 11:49 AM IST
Covid 19 iit kanpur professor says third wave will end in april

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో సంక్రాంతి నాటికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో కూడా మూడవ దశ ప్రారంభం అవుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఒక్కరినీ ఈ వేరియంట్ ప్రభావితం చేస్తుందని కూడా వైద్యనిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇది ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరితం తారాస్తాయికి చేరి ఏకంగా ప్రతీరోజు లక్షల కేసులు నమోదవుతాయని కూడా అంచనా వేశారు. అయితే ఇది డెల్టా వేరియంట్ అంత తీవ్రంగా లక్షణాలు కలిగి ఉండదని, దాదాపుగా 90 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించవని కూడా అధ్యయనాలు ఇప్పటికే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తొలిదశ కరోనా బీభత్సం నాటి నుంచి దీనిపై తన మాథమెటికల్ టేబుల్ ఆధారంగా అధ్యయనం చేస్తున్న ఐఐటీ కాన్పుర్ కు చెందిన ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ తాజాగా మూడవ దశపై కూడా కీలక విషయాలను వెల్లడించారు. భారత్​లో కొవిడ్‌ థర్డ్ ​వేవ్ జనవరిలోనే మొదలవుతుందని.. అది జనవరి నుంచి నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ వరకు ​ఉంటుందని పేర్కొన్నారు. ఈ దశ ఉన్నత స్థాయికి చేరిన క్రమంలో రోజుకు 1.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఆసుపత్రుల బారిన పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.

ఇక ఈ దశ అధ్యధికంగా ప్రబలడానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలు సూపర్​ స్ప్రెడర్లుగా మారతాయని హెచ్చరించారు. భారీ ప్రజా సమూహాల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం అంత సులువు కాదన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ర్యాలీలు జరిగే అవకాశాలే అధికమని మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఎన్నికల ర్యాలీల్లో భారీఎత్తున ప్రజలు పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను పాటించరు. దీనివల్ల దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో థర్డ్ వేవ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది.

అయితే ఈసారి కరోనా సోకిన ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుంది. మార్చి చివరి నాటికి దేశంలో రెండు లక్షల పడకలు అవసరమవుతాయి’ అని వెల్లడించారు. భారత్‌లోని ప్రజలకు రోగనిరోధకశక్తి అధికంగా ఉందని మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఆఫ్రికా, భారత్​లో 80శాతం జనాభా 45ఏళ్ల లోపువారేనని.. వీళ్లకు సాధారణ రోగనిరోధక శక్తి 80శాతం వరకు ఉంటుందన్నారు.  మ్యూటెంట్ల కారణంగానే డెల్టా వేరియంట్​ వచ్చిందన్నారు. దక్షిణాఫ్రికా మాదిరే భారత్​లోనూ వేరియంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles