Driver arrested in Garland shooting that killed 3 అమెరికాలోని రెండు వేర్వురు నగరాల్లో కాల్పులు.. 8 మంది మృతి

4 dead 3 injured in denver area killing spree suspected gunman is dead

U.S. Denver firing, Dallas firing, Texas shooting, Lakewood firing, Colorado firing, US gun Firing, Gun firing, Gun Culture, US gun firing, US gun culture, US gun violence, America, Crime

A shooting spree has left five people dead, including the shooter in Denver. Authorities believe the suspect, who they have not yet publicly identified, fired a firearm in at least seven different locations across Denver in Lakewood, Colorado last night. After three shootings in Denver, police identified a car associated with the suspect, leading to an exchange of gunfire between police and the suspect.

అమెరికాలోని రెండు వేర్వురు నగరాల్లో కాల్పులు.. 8 మంది మృతి

Posted: 12/29/2021 11:31 AM IST
4 dead 3 injured in denver area killing spree suspected gunman is dead

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. గన్ కల్చర్‌ పై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూనే వుంది. ఫలితంగా అమాయక అమెరికా వాసులు తుపాకీ గుళ్లకు బలికావాల్సవ వస్తోంది. మనస్తాపానికి గురైన ప్రతీ వ్యక్తి.. తాము ఈ విధంగా మారడానికి కారనమైన ప్రత్యర్థులపై తుపాకులతో విరుచుకుపడటం సర్వసాధారణంగా మారింది. అయితే ఎప్పుడు ఎవరు, ఎందుకు ఎవర్ని చంపేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ అమాయకులు బలవుతున్నారు. తమ సహచరులపై ఆగ్రహంతో, ప్రతీకారంతో, క్షణికావేశంతో కాల్పులకు తెగబడటం అమెరికాలో ట్రెండ్ గా మారింది.

ఉగ్రమూకల చర్యలకంటే తొటి అమెరికన్ల చేతిలో కాల్పులకు బలవుతున్నవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. పెద్దల బాటలోనే పయనిస్తున్న అమాయక చిన్నారులు, పాఠశాల విద్యార్థులు కూడా ఇదేవిధానాన్ని ఫాలో అవుతూ.. తుపాకీ విషసంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇటీవల టెక్సాస్ లోని ఓ పాఠశాలలో తోటివిద్యార్థుల చర్యలతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. మరుసటి రోజు తుపాకీని తీసుకువచ్చి.. తన సహచర విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోనూ తుపాకీ కాల్పులు దద్దరిల్లాయి.

అమెరికాలోని డల్లాస్ నగరంతో పాటు డెన్వర్లలో తుపాకీ తూటాలు పేలాయి. ఈ రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నగర శివారులోని గార్లాండ్ లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకు వెళ్లి.. మళ్లీ వెంటనే తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే అదే ట్రక్‌లో పరారయ్యాడు. కాగా డెన్వర్ సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నగర సమీపంలోని ఓ వాణిజ్య ప్రదేశానికి కారులో వచ్చిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles