BJP will provide liquor for just Rs 70: AP BJP president బీజేపి అధికారంలోకి వస్తే.. రూ.75కే క్వార్టర్ సీసా.!: సోము వీర్రాజు

Cast 1 crore votes to bjp and we will provide liquor for just rs 70 ap bjp president

Somu Veerraju, BJP president Somu Veerraju, poor-quality liquor, higher price, quarter @ 70, good governance, Prakash Javadekar, Prajagraha Sabha, BJP, YSRCP, TDP, TRS, Massive corruption, dynasty politics, leaders on Bail, CM Jagan, Visakha MP, Vijay Sai Reddy, leaders into Jail, Telangana, Vijayawada, Andhra Pradesh, Politics

Andhra Pradesh BJP president Somu Veerraju on Tuesday said that if the party gets one crore votes in the state, then liquor will be provided at Rs 70, reported news agency ANI. He further said that if more revenue is left, then the cost of liquor will be brought down to Rs 50.

బీజేపి అధికారంలోకి వస్తే.. రూ.75కే క్వార్టర్ సీసా.!: సోము వీర్రాజు

Posted: 12/29/2021 12:27 PM IST
Cast 1 crore votes to bjp and we will provide liquor for just rs 70 ap bjp president

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని మందుబాబులకు గోప్ప ఊరటనిచ్చే వార్తను ఏకంగా ప్రజాగ్రహ సభలో సెలవిచ్చారు. రాష్ట్రంలోని మందుబాబులు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో వున్నారని పసిగట్టిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే.. వైసీపీ ప్రభుత్వం విక్రయిస్తున్న నాసిరకం మద్యానికి బదులుగా నాణ్యమైన మద్యాన్ని తక్కవ ధరకే అందిస్తామని అన్నారు. మద్యం క్వార్టర్ సిసాను కేవలం రూ.70కే అందిస్తామన్న ఆయన.. రెవెన్యూ మరింత మిగిలితే.. రాష్ట్రంలో మద్యం మరింత చౌకగా అంటే ఏకంగా రూ. 50కే అందిస్తామ‌ని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క క్వార్టర్ లిక్కర్ ధర రూ.200గా ఉంది. తెలంగాణలో ఇది ఇంచుమించు రూ.100గా ఉంది. లిక్కర్ కు సంబంధించి సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి.. ప్రజలను నిట్టనిలువునా ప్రభుత్వమే దోపిడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లన్ని నాసిరకానివే అన్న ఆయన.జ. అన్నీ అధిక ధరలకే విక్రయిస్తున్నట్లు చెప్పారు. అందరికీ తెలిసిన ప్రముఖ బ్రాండ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో లభించవని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం తీసుకునే ప్రతీ వ్యక్తీ నెలకు 12వేల రూపాయలను మద్యానికి వెచ్చిస్తున్నారని సోమువీర్రాజు అన్నారు.

ప్రభుత్వం సంక్షేమ పధకాలను భలేగా చేపట్టిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని.. అయితే కుడి చెత్తో ఇచ్చి ఎడమ చేతితో లాక్కోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందిని ఆయన పథకాలకు, మధ్యానికి మధ్య ఉన్న లింక్ ను చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మద్యం తాగేవారు వున్నారని, వారికి ఏదో పథకం కింద లభించే ఆరు నుంచి ఏడు వేల రూపాయలను.. మద్య పేరుతో లాగేసుకుంటున్నారని అన్నారు. ఇక పైపెచ్చు మద్యం కోసం ఏకంగా ఇంట్లోని ఐదు వేలు కూడా ఖర్చుపెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మందు బాబులందరూ బీజేపికి ఓటు వేస్తే.. మద్యం క్వార్టర్ సీసాను రూ.75కే ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో లిక్కర్ ఫ్యాక్టరీలను నడుపుతూ.. ప్రభుత్వానికి నాసిరకం లిక్కర్ ను సరఫరా చేస్తున్నట్టు వీర్రాజు ఆరోపించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles