Mulugu Former Sarpanch Killed By Maoists తెలంగాణలో మావోల దుశ్చర్య.. మాజీ సర్పంచ్ రమేశ్ హత్య

Maoists assassinated suraveddu former sarpanch ramesh in mulugu of telangana

Ramesh, former sarpanch, Sooraveedu village, Cherla, abduction, police informer, kursa Rajitha, Venkatapuram mandal, Mulugu district, Wajedu area committee, maoist secretary Shantha, Telangana, crime

A former Sarpanch from Mulugu District of Telangana who went missing was killed by Maoists and his dead body was found in the borders of Telangana and Chattisgarh. The dead body was found near Kothapalli of Chattisgarh. Maoists released a letter claiming that the deceased was a police informer.

తెలంగాణలో మావోల దుశ్చర్య.. మాజీ సర్పంచ్ రమేశ్ హత్య

Posted: 12/22/2021 01:16 PM IST
Maoists assassinated suraveddu former sarpanch ramesh in mulugu of telangana

తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకుంటున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ను అదుపులోకి తీసుకున్న మావోలు ఇవాళ అతడ్ని హతమార్చారు. జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్‌ రమేశ్ ను హతమార్చారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ప్రకటించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో రమేశ్ మృతదేహాన్ని మావోయిస్టులు వదిలి వెళ్లారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు.

స్వతహాగా ఆటో డ్రైవర్ అయిన మాజీ సర్పంచ్ కురుసం రమేశ్.. సమీపంలోని చెర్లకు వెళ్తుండగా సోమవారం రోజున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా గమనించిన స్థానికులు విషయాన్ని ఆయన భార్యకు తెలుపగా, వెంటనే స్పందించిన అమె.. మావోలకు తన భర్తను విడిచిపెట్టాలని కోరింది. తాను అమాయకుడని చెప్పింది. ఒకవేళ వారి దృష్టిలో తప్పుచేసినా క్షమించి వదిలేయాలని అమె ప్రాధేయపడింది. అయినా అమె వ్యధను పరిశీలనలోకి తీసుకోని మావోలు.. రమేశ్ పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరించాడని.. అందుకనే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ లోని కొత్తపల్లి సమీపంలో వదిలేశారు.

కాగా రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సూరువీడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపోందారు. ఆ తరువాత ఆయన భార్య రజితకు ఏటూరు నాగరం సామాజిక అసుపత్రిలో ఏఎన్ఎం ఉధ్యోగం రావడంతో మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. అయితే గతంలో రమేశ్ మావోయిస్టులకు కొరియర్ గా పనిచేసి.. ప్రస్తుతం పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని అరోపించిన మావోయిస్టులు అతడ్ని హతమార్చారు. రమేశ్ కారణంగా స్థానికంగా ఓ ఎన్ కౌంటర్ జరిగిందని, మరో మావోయిస్టు హత్యకు కూడా రమఏష్ కారణంగా అరోపించిన మావోయిస్టులు అతడ్ని హతమార్చారు.

ఈ విషయమై చత్తీష్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రజా కోర్టు నిర్వహించి  రమేష్ చేసిన తప్పులను ఎత్తి చూపి ప్రజా కోర్టులో అతడిని మావోయిస్టులు హత్య చేశారు. కాగా, ములుగు పోలీసుల వలలో పడి ఇన్‌ఫార్మర్లుగా మారిన వారికి రమేశ్ హత్య ఓ గుణపాఠమని చెబుతూ.. మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. కాగా స్థానిక పోలీసులు రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే తాజాగా వెలుగు చూసిన రమేశ్ హత్యతో ఛత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారన్న అనుమానాలు ఈ హత్యతో బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles