HC pulls up SP, grants bail to TDP workers టీడీపీ మహిళా నేతల కేసు: ఎస్పీపై హైకోర్టు ఆగ్రహం

Andhra pradesh high court pulls up anatapur sp grants bail to tdp workers

TDP women Leaders, Anticipatory bail, Andhra Pradesh High Court, Anantapur SP, Dr Fakeerappa Kaginelli, Fourth Town Police Station, TDP workers, TDP worker, HC pulls up SP, grants bail to tdp workers, Grants bail, ap hc pulls up SP, CM YS Jagan, EX-CM Chandrababu Naidu, Bhuvaneshwari, T.Swapna, P.VijayaLakshmi, KC Janaki, S.Tejeshwini, House raids, CRPC section 41A, Police notices, Ananatapur SP, Andhra pradesh, Crime

The Andhra Pradesh High Court pulled up Anantapur SP for filing an improper report in the case registered against TDP women workers and subsequent searches made by the police. The high court Judge Justice D Ramesh posed a series of questions and expressed displeasure over the SP for filing the report by simply attaching the report given by the investigation officer.

టీడీపీ మహిళా నేతల కేసు: ‘అనంత’ ఎస్పీపై హైకోర్టు ఆగ్రహం

Posted: 12/22/2021 02:55 PM IST
Andhra pradesh high court pulls up anatapur sp grants bail to tdp workers

ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై పలువురు అధికార పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి ప్రతిగా కొందరు టీడీపీ మహిళా నేతలు అనంతపురంలో పత్రికా సమావేశంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో మహిళా నేతలపై ఏయే సెక్షన్ల కింద కేసును నమోదు చేశారో.. మరి అలాంటప్పుడు వారి ఇల్లు వంటగదులతో పాటుగా ఎందుకని పోలీసులు సోదాలు నిర్వహించారని ఈ నెల 10న న్యాయస్థానం ప్రశ్నించింది.

ఈ కేసులో జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఈ మేరకు తమ ఎదుట హాజరుకావాలని అదేశించింది. ఇక హాజరుకాబోయేందుకు ముందు తమ ఎదుట ఈ కేసుకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. అనంతపురంలో కొందరు టీడీపీ మహిళా నేతలపై నమోదైన కేసు, ఆ తర్వాతి పరిణామాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎస్పీ ఫకీరప్పపై ప్రశ్నల వర్షం కురిపించింది. మహిళలపై నమోదైన కేసుకు, వారి ఇళ్లలో సోదాలు చేయడానికి ఉన్న సంబంధమేంటని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందో చెప్పాలని నిలదీసింది. ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సోదాలు చేశారో చెప్పాలని ప్రశ్నించింది.

ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు అధికారి నివేదిక జతచేసి అఫిడవిట్‌గా ఎలా సమర్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అఫిడవిట్‌లో ఏమైనా విషయం ఉందా? దానిని మీరు చూశారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఎస్పీని ప్రశ్నించగా రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఎస్పీ సమాధానమిచ్చారు. దీంతో కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు టీడీపీ మహిళా నేతలకు ఇది వరకే కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles