Railway Engineer Suspended for Illegal Sale of Steam Engine రైలు ఇంజన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు..ఇంజనీరు లీల..

Railway engineer in bihar sells steam engine at rly station suspended official

Rajiv Ranjan Jha, railway engineer, Samastipur Railway Division, abandoned steam engine, Purnia Court railway station, FIR, Banmankhi RPF, Bihar, Crime

Rajiv Ranjan Jha, a railway engineer of the Samastipur Railway Division in Bihar, is caught selling an abandoned steam engine lying at Purnia Court railway station and is placed under suspension. The illegal sale took place on December 14. A First Information Report (FIR) was registered on a complaint by the Purnia court railway station given to the Banmankhi RPF post.

పాత రైలు ఇంజన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు.. బీహార్ ఇంజనీరు లీలలు..

Posted: 12/21/2021 04:30 PM IST
Railway engineer in bihar sells steam engine at rly station suspended official

ఫ్రిగా వస్తే ఫెనాయిల్ తాగేవాళ్లును చూశాం కానీ.. ఏకంగా కనబడిందల్లా కాజేసేవాళ్లను మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. ఏది తస్కరించాలో.. ఏదీ వద్దో కూడా తెలియని ఘనులు ఏకంగా రైల్వే స్టేషన్లోని పురాతన ఇంజన్ ను దొంగలించారు. ఔరా.. రైలు ఇంజన్ ను దొంగలించడం ఏలా సాధ్యం. అది అయ్యే పనేనా.? అంటే.. ఈ అనితర సామాన్యులతో అన్నీ సాధ్యమనే చెప్పాలి. అయినా రైలు ఇంజన్ ఎత్తుకెళ్లినా మళ్లీ పట్టాలపైకి తీసుకురావాల్సిందే కదా.? అది పట్టాలపై కాకుండా మరెక్కడ నడుపుతారు.? అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.

ఈ ఘరాణా దొంగలు ఏకంగా రైలు ఇంజన్ ను మాయం చేశారు. ఓహ్ ఇది దొంగల పనా.? అంటారా. అంతేగా మరి ఇంటిదొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారుగా. కంచే చేను మేస్తే.. ఎవరికి మాత్రం తెలుస్తుంది. మీకు వచ్చిన డౌట్ కరెక్టే. వీళ్లు ఇంటి దొంగలే. వీరు పనిచేసిది కూడా రైల్వేశాఖలోనే కావడంతో.. రైలు ఇంజన్ ను కొట్టేయడం వీరికి సునాయాసమైంది. నకిలీ పత్రాలను సృష్టించిన ముగ్గురు కేటాగాళ్లు కలసి ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్​ పుర్ణియా కోర్టు రైల్వే స్టేషన్​ పరిధిలో ఉన్న సమస్తిపుర్​ లోకో డీజిల్ షెడ్​లో రాజీవ్​ రంజన్​ ఝా అనే వ్యక్తి ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు.

తాను పనిచేసే స్టేషన్​లో చిన్నరైల్వే ట్రాక్​పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్​ ఉంది. దానిపై కన్నేసిన రాజీవ్.. రైల్వే శాఖ ఉన్నాతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా.. వచ్చినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించేశాడు. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్ డిసెంబర్ 14న గ్యాస్ కట్టర్​తో రైలు ఇంజిన్​ను ముక్కలుగా చేసేశాడు. ఇందుకు ఓ హెల్పర్ కూడా అతనికి సాయం చేశాడు. కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకునే సరికి నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్​ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్​ షెడ్​కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని వారిని నమ్మించాడు.

ఆ పత్రాల ఆధారంతో ఏకంగా రైలు ఇంజిన్‌ను పాత సామాను కొనుగోలు చేసే వారికి అమ్మేశాడు రాజీవ్​ రంజన్​ ఝా. ఈ దొంగతనం కుట్రలో అతనికి స్థానిక పోలీస్​ ఇన్​స్పెక్టర్​, ఓ హెల్పర్ కూడా సహకరించారు. అయితే రాజీవ్ పై స్టేషన్ అధికారులకు అనుమానం రావడంతో డీజిల్ షెడ్ కు వెళ్లి చూశారు. అక్కడి రైలు ఇంజన్ పరికరాలు లేకపోవడంతో.. వారు ఉన్నాతాధికారులకు సమాచారం అందించారు. అయితే తాము రైలు ఇంజన్ ను స్రాప్ చేయాలని ఎవరికీ ఎలాంటి అదేశాలను పంపలేదని రైల్వే ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. దీంతో స్టేషన్ మాస్టార్, ఉద్యోగులు కలసి ఆర్పీఎఫ్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసు విచారణలో అసలు విషయాన్ని అంగీకరించాడు రాజీవ్​ రంజన్​ ఝా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles