`An event cancelled is better than a life cancelled`: WHO chief ఒక్క వేడుక కన్నా ప్రాణం మిన్న: ప్రపంచ అరోగ్య సంస్థ

Whos chief tedros adhanom calls on world to end covid 19 pandemic in 2022

Dr Tedros Adhanomfour, concern, new variant, Omicron Variant, spreading vigourously, delta variant, corona vaccine, omicron, WHO, Omicron, WHO report on Omicron, WHO latest report on Omicron, Covid, Covid Omicron, WHO latest report, omicron latest news, omicron updates

With the COVID-19 Omicron variant continuing to spread and relatives and friends intending to get together over the holidays, the head of the World Health Organization has cautioned that celebrations may need to be cancelled. Dr Tedros Adhanom Ghebreyesus, speaking in Geneva, remarked, "An event cancelled is better than a life cancelled. It’s better to cancel now and celebrate later, than to celebrate now and grieve later."

ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అనిశ్చితి.. వ్యాక్సీన్లు అందని దేశాలు జాస్తి: డబ్ల్యూహెచ్‌ఓ

Posted: 12/21/2021 03:31 PM IST
Whos chief tedros adhanom calls on world to end covid 19 pandemic in 2022

ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచదేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా 2022లో కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలన్నీ కలసి అంతం చేయాలని సూచించింది. ఈ మేరకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ ఘెబ్రేస‌స్ అన్నారు. ఇందుకోసం అంద‌రూ క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న‌ అభిప్రాయ‌ప‌డ్డారు. జెనీవాలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ.. “ఒమిక్రాన్ లాంటి కొత్త కొ్త్త వేరియంట్ల‌ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న స‌మ‌యంలో పండ‌గ‌ల వేళ‌ ఆంక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా విధించాలని సూచించారు.

ప్ర‌స్తుతం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ మిగ‌తా వేరియంట్ల క‌న్నా చాలా వేగంగా వ్యాపిస్తోందని.. అందువ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకోవ‌డం క‌న్నా పండ‌గ‌లకు ఈ ఒక్క ఏడాది దూరంగా ఉండటం మంచిదని ఆయన సూచనలు చేశారు. అలాగే చాలాదేశాలలో ఇప్ప‌టికే జ‌నం మొద‌టి డోస్ వాక్సీన్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 40 శాతం వ్యాక్సిన్ కవరేజీ లక్ష్యాన్ని చేరుకోలేని 50 కి పైగా దేశాలు ఉన్నాయని అన్నారు. వీటికి వాక్సీన్లను అందించే ప్రక్రియను సంపన్న దేశాలు సాయం అందించాలని కోరారు. అప్పుడే కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమేయడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మ‌రోవైపు ధ‌నిక దేశాలు వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుంటున్నాయని అన్నారు. ఇలా పూర్తిగా వాక్సీనేట్ చేసుకోవడం మంచిదే అయినా.. పేద, ధనిక దేశాలన్న తారతమ్యాలు లేకుండా అన్ని దేశాలు సమాంత‌రంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగితే అది కరోనా మహమ్మారిని తరిమేందుకు చక్కని మార్గమని ఆయన అన్నారు. ఇలా జరగని పక్షంలో ఒమిక్రాన్ తరహాలో మరో రూపం మార్చుకుని మరో వేరియంట్ ప్రజలపై పడే అవకాశాలు లేకపోలేవని ఆయన పేర్కోన్నారు, ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా, అమెరికా, యూర‌ప్ లాంటి దేశాల‌లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండ‌గా.. క్రిస్మ‌స్ పండుగల కోసం అక్క‌డ జ‌నం స‌మూహాలుగా ఏర్ప‌డితే వైర‌స్ ఇంకా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు కీల‌కంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles