High court sensational comments on Live-in Relationship సహజీవనంపై పంజాబ్ హర్యానా కోర్టు కీలక వ్యాఖ్యలు.!

Adult male under 21 can t marry but can live with consenting partner punjab and haryana high court

punjab haryana high court, major woman, major man, marriageable age, supreme court, live-in relationship, adult couple, major couple, protection to couple, singh gill, hindu marriage act, haryana, constitution, gurudaspur, punjab, Crime

An adult man under the legally marriageable age of 21 can live like a couple outside wedlock with a consenting woman 18 years or above, the Punjab and Haryana high court said last week. The HC’s remarks were in line with a Supreme Court order in May 2018 that an adult couple can live together without marriage.

సహజీవనం ప్రాథమిక హక్కుల్లో భాగమే.. పంజాబ్ హర్యానా కోర్టు కీలక వ్యాఖ్యలు..

Posted: 12/21/2021 12:32 PM IST
Adult male under 21 can t marry but can live with consenting partner punjab and haryana high court

ఐదు రోజుల క్రితం మేజర్లుగా వున్న స్త్రీ, పురుషుడు ఒక్కటిగా జీవించడాన్ని సహజీవనంగా పేర్కోనలేమని వ్యాఖ్యానించిన పంజాబ్ హర్యానా హైకోర్టు తాజాగా సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లు అయినా చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసుకు చేరుకోక ముందు.. 18 ఏళ్లు నిండిన మహిళతో పరస్పర అంగీకారం మేరకు వైవాహిక తరహా జీవనం కొనసాగించుకోవచ్చని తీర్పును వెలువరించింది. 2018 మే నెలలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన తీర్పు మాదిరే పంజాబ్ అండ్ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి.

వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓ జంట రక్షణ కోరుతూ ఆశ్రయించడంతో హైకోర్టు వారికి మద్దతుగా నిలిచింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఓ జంట సహజీవనం సాగిస్తున్నారు. వీరిద్దరికీ వయసు 18 ఏళ్లు నిండింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆమెకు వివాహ వయసు వచ్చింది కానీ, అతడికి 21 ఏళ్లు నిండితేనే ఆ అర్హత లభిస్తుంది. దీంతో వీరిద్దరు సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. వారు ఒక్కటిగా జీవించడాన్ని వ్యతిరేకిస్తున్న ఇరు కుటుంబాలు వారిని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ వారు హైకోర్టును వేడుకున్నారు. తమను చంపే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది వాస్తవం. అలాగని చెప్పి భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్ పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles