viral video: beggar rains note at railway station రోడ్డుపై కరెన్సీ నోట్లు కనిపించినా.. ముట్టుకోని జనం..

Beggar rained notes people were blown away after seeing notes flying on the platform

old beggar, rained notes, documents, GRP team, Nagda railway Station, Burhanpur, Ujjain, Madhya Pradesh, Crime, viral video, video viral

A shocking thing has happened in Ujjain, Madhya Pradesh. An old beggar suddenly rained notes on the Nagda railway station area. Passengers were shocked to see the beggar's money on the platform. At the train station, the beggar got into an argument with someone.

ITEMVIDEOS: రోడ్డుపై కరెన్సీ నోట్లు కనిపించినా.. ముట్టుకోని జనం.. ఎందుకో తెలుసా.?

Posted: 12/21/2021 01:38 PM IST
Beggar rained notes people were blown away after seeing notes flying on the platform

ఆకాశం నుంచి డబ్బులు ప‌డితే ఎంత బాగుంటుందోన‌ని మ‌న‌కు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజ‌జీవితంలో అలా జ‌రిగితే అది విచిత్ర‌మే అవుతుంది. అలాంటి ఒక ఘటన నిజంగా కూడా జరిగింది. అయితే అది ఆకాశం నుంచి కాదు కానీ దుబాయ్ లో ఇలా నోట్లు వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇక మన దేశంలోనూ ఓ కంపెనీ పై ఐటీ దాడులు జరిగిన సమయంలో వారు డబ్బును పై అంతస్థులోని ఆ కార్యాయం కిటికీలోంచి విసిరివేయడంతో అది కాస్తా నోట్ల వర్షంలా కురిసింది. దీంతో అక్కడి వారు దొరికినవారికి దొరికినంత నోట్లును ఏరుకని జేబుల్లో నింపేసుకున్నారు.

ఇక ముంబైలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అదికేవలం సముద్రం వరకు మాత్రమే పరిమితం కావడంతో నీటిపై తేలియాడుతున్న నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. అయితే ఇలాంటి విచిత్రమైన ఘటన తాజాగా మనదేశంలో జరిగింది. ఇక్కడ ఆకాశం నుంచి కాదు కానీ మొత్తానికి డబ్బు మాత్రం రోడ్డుపై పడింది. రూ. 500 మొదలుకుని రూ.200, రూ.100, రూ.50 నోట్లతో పాటు రూ.20, రూ10 నోట్లు కూడా రోడ్డుపై అడ్డదిడ్డంగా పడివున్నాయి. ఇదే విచిత్రమంటే.. ఇంతకుమించిన చిత్రమేమిటంటే..  రోడ్డుపై పడిన ఈ డబ్బును ఎవ్వరూ తీసుకోలేదు. నిజంగానే విచిత్రం కదూ. ఇందుకు సంబంధిచిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఒక వృద్ధుడు కరెన్సీనోట్లను రోడ్డుపై విచ్చలివిడిగా ఎగరేస్తూ కనిపించాడు. ఉజ్జైని నగరంలోని నాగదా రైల్వేస్టేషన్ బయట ఒక వృద్ధుడు నోట్లను గాల్లో ఎగిరేస్తున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు ఇది చూసి నివ్వెరపోయారు. తన వద్ద డబ్బు లేదని తనవారే తనను దూరం పెట్టారన్న అవేదనలో ఇలా చేశారో.. లేక తనవారిని దక్కించుకునే క్రమంలో డబ్బులేక దూరం చేసుకున్నానన్న వ్యధతో ఇలా చేయాడో తెలియదు కానీ.. తాను ఇన్నాళ్లు కష్టపడి యాచించిన సొమ్మును మొత్తం ఇలా రోడ్డు మీద పడేసాడు.

ఇది చూసిన ఓ ప్రయాణికుడు ఆ వృద్ధుడి చేసే పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఆ తరువాత ఒక సంచిలో నుంచి రూ.10, రూ.20 నోట్లను కూడా తీసి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై విసిరేశాడా వృద్ద యాచకుడు. డబ్బుతో ముడిపడిన తన గతమేదో గుర్తుకు రావడంతోనే వృద్ద యాచకుడు ఇలా చేశాడని అక్కడివారు భావిస్తున్నారు. పైగా ఆ ముసలి వ్యక్తికి అలా చేయవద్దని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ నోట్లతో పాటు అతని సంచిలో నుంచి కొన్ని ఆస్తి పత్రాలు కూడా జారిపడుతున్నట్లు కనిపించాయి. ఇదంతా జరిగాక అక్కడున్న ప్ర‌యాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆ వృద్ధుడిని, అతని డబ్బుతో సహా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles