ICMR designs kit for Omicron detection ఒపిక్రాన్ ను వేగంగా గుర్తించే ఐసీఎంఆర్ కిట్..

Icmr designs kit for omicron detection invites eoi from manufacturers for its commercialisation

coronavirus, covid-19, covid testing, RT-PCR, Omicron, new variant, ICMR, covid testing kit, omicron testing kit

The Indian Council of Medical Research (ICMR) has designed a diagnostic kit for detection of Omicron variant of the coronavirus and has invited Expression of Interest from in vitro diagnostics (IVD) kit manufacturers for undertaking transfer of technology for its development and commercialisation.

జీనోమ్ సీక్వెన్సింగ్ లేకుండా.. ఒపిక్రాన్ గుర్తించే ఐసీఎంఆర్ కిట్..

Posted: 12/20/2021 04:39 PM IST
Icmr designs kit for omicron detection invites eoi from manufacturers for its commercialisation

బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ లో ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య వేలల్లో ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాణనష్టం తక్కువగా ఉండడం ఒక్కటే ఊరట తప్ప, ఇది అమితవేగంగా వ్యాప్తి చెందుతూ పలు దేశాలకు సవాలుగా మారింది. ఒమిక్రాన్ ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ తప్పనిసరి కావడంతో ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే సరికొత్త టెస్టింగ్ కిట్ ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆవిష్కరించింది. ఈ కిట్ ను, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డిబ్రూగఢ్ లోని ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనితో త్వరితగతిన ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే వీలుంటుంది. ఈ కిట్ ను వాణిజ్య పంథాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఐసీఎంఆర్ ఆహ్వానిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందన్న విషయం తెలిసిందే.

ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా వున్నామని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటన చేసింది. అవసరమైన ఔషధ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిరోజూ నిపుణులతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 161 ఒమిక్రాన్ కేసులున్నాయని పేర్కొన్నారు. తొలి, రెండో దశల నుంచి నేర్చుకున్న పాఠాలతో అప్రమత్తంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఇక డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఇప్పటికే  రాష్ట్రాల వద్ద 17 కోట్ల టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

త్వరలోనే పిల్లల వ్యాక్సిన్ కూడా వస్తుందని, ప్రస్తుతం నెలకు 31 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయగల సత్తా భారత్ కు ఉందని వెల్లడించారు. మరో రెండు నెలల్లో నెలకు 45 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద తగినంత మేర వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 88 శాతం తొలి డోసు, 58 శాతం రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నామని కేంద్రమంత్రి రాజ్యసభలో చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  covid testing  RT-PCR  Omicron  new variant  ICMR  covid testing kit  omicron testing kit  

Other Articles