Police justifies taking bribe: UP cop tells students లంచం తప్పుకాదని విద్యార్థుల పోలీసులు క్లాస్..!

Viral video if police takes money it gets the job done up cop tells students

up police, unnao cop bribery video, unnao police, police ke pathshala, bribery not a crime, bribery acceptence, bribery justification, student, Teachers, bribery, justisification, up police, unnao cop bribery video, unnao police, Uttar Pradesh Police, Crime, education news

A video showing a cop with the Uttar Pradesh Police admitting to the police taking bribes went viral on social media. Interacting with students at a school in UP's Unnao district during the Police ki Pathshala programme, the cop could be heard saying that "if the police take money, it gets the job done".

ITEMVIDEOS: లంచాలను తీసుకోవడాన్ని సమర్థించుకున్న పోలీసులు.. విద్యార్థులకు సూక్తులు

Posted: 12/20/2021 03:45 PM IST
Viral video if police takes money it gets the job done up cop tells students

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గూ అన్నట్లు.. ఉద్యోగం రానంత కాలం ఉధ్యోగం వస్తే చాలునని అభిప్రాయం కాస్తా.. ఉద్యోగం వచ్చాక.. లంచాలు తీసుకునే ఉద్యోగం వస్తే బాగుండు అని.. మనిషి జీవితానికి తృప్లి ఉండదు. అయితే లంచాలు తీసుకోవడం తప్పు.. అన్న విషయం పాఠ్యాపుస్తకాల్లోనూ ఉంటుంది. ఇక అంతకుమించి.. ప్రతీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తాటికాయంత పెద్ద అక్షరాల్లోనూ రాయబడి వుంటుంది. అంతేకాదు.. ఈ కార్యాలయాల్లో ఎవరైనా అధికారి పనులు చేసేందుకు డబ్బులు అడిగితే.. అదే లంచం అడిగితే తక్షణం ఫలానా నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా ఉంటోంది.

ఇక చిన్నారి విద్యార్థుల్లో అయితే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఎవరు వస్తారు.? అంటే ఠక్కున చెప్పే సమాధానం పోలీసులు. ఔను. కానీ అలాంటి పోలీసులు విద్యార్థుల మదిని చెడగోడుతున్నారు. చిరు ప్రాయంలోనే దేశ భావితరాల మదిలో లంచం తప్పు కాదు అని పాఠాలు బోధిస్తున్నారు. లంచాలు తీసుకునే అనేక ప్రభుత్వ కార్యాలయాలు పనులను సక్రమంగా చేయవని, అదే పోలీసులు అయితే ఒక్కసారి లంచం తీసుకున్నారా.. ఇక మీ పనులు ఠక్కున పూర్తి చేస్తారని వారి మదిని ఇప్పట్నించే కాలుష్యపరుస్తున్నారు. అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకుంటారా..? పోలీసులు కూడా లంచాలు తీసుకునే పనిచేస్తారా.? అని పిల్లలు భిక్కముఖాలు వేసుకున్నారు.

ఇది ఎక్కడో కాదు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో లంచాలు తీసుకోవడాన్ని సమర్ధించుకున్నారు అక్కడి పోలీసు అధికారి. అది కూడా ఒక పాఠ‌శాల కార్య‌క్ర‌మంలో విద్యార్థులంద‌రి సమక్షంలో వేదికపైనుంచి ప్రసంగిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని శాఖల్లోకెల్లా పోలీసు శాఖ ఉత్తమమైనదని చెప్పుకోచ్చిన ఆయన.. ఇంత చేసి.. తన పరువును తానే తీసుకున్నాడు. అత‌ను మాట్లాడిన ప్ర‌సంగాన్ని ఒక జ‌ర్న‌లిస్ట్ రికార్డ్ చేసి ఆ వీడియోని ట్విట్టర్‌ పెట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైర‌ల్ అవుతోంది. నెట్ జనులు మాత్రం ఈ విడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఉన్నావ్ జిల్లాలో ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో పోలీస్ కీ పాఠ‌శాల అనే కార్య‌క్రమంలో విద్యార్థుల‌ను ఉద్దేశిస్తూ ఆ జిల్లా పోలీస్ అధికారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. పోలీస్ శాఖ చాలా నీతివంత‌మైన‌ద‌ని.. ఇత‌ర శాఖలు డబ్బు తీసుకున్నా ప‌ని చేయ‌వు.. కానీ తాము మాత్రం డ‌బ్బు తీసుకుంటే త‌ప్ప‌కుండా ప‌ని చేస్తామని చెప్పారు. కరోనా కష్టకాలం రాగానే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సెలవులు వచ్చాయి. ఉపాధ్యాయులైతే ఇంట్లో కూర్చోనే ఆరునెలల పాటు జీతాలు తీసుకున్నారు. కానీ తాము మాత్రం కరోనా వచ్చిదంటే.. సెలవులన్నీ రద్దు చేసుకుని విధులు నిర్వహించాలి. మరింతగా జనంలోకి వెళ్లి పనిచేయాల్సి వస్తుందని అన్నారు. ఇక దీనిపై నెట్ జనులు పోలీసులపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles