International arbitration centre opened in Hyderabad రాజీ, మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర: సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

Cji ramana asks judges to make hyderabad s iamc the best arbitration centre in asia

International arbitration centre, Justice NV Ramana, Telangana Chief Minister K Chandrasekhar Rao, CM KCR, CJI Ramana, IAMC, Justice RV Ravindran, high court Chief Justice Satish Chandra Sharma, Justice Lavu Nageshwar Rao, Phoenix VK tower , Hyderabad, Hyderabad news, Hyderabad latest news, Telangana

Chief Justice of India Justice N.V. Ramana urged judges of the Andhra Pradesh and Telangana High Courts to construct an arbitration and mediation centre in Hyderabad for litigants and work towards making it the best arbitration centre in Asia.

ఐఏఎంసీని ఉత్తమ అర్బిట్రేషన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని జడ్జీలను కోరిన సీజేఐ

Posted: 12/18/2021 02:46 PM IST
Cji ramana asks judges to make hyderabad s iamc the best arbitration centre in asia

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఐఏఎంసీ ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు.. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్ర‌తిపాదించ‌గానే కేసీఆర్ అంగీక‌రించారు. త‌క్కువ కాలంలో మంచి వ‌స‌తుల‌తో ఐఏఎంసీ ఏర్పాటైంది. ఐఏఎంసీ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన సీఎం కేసీఆర్‌కు, మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన ప్ర‌భుత్వానికి ఎన్వీ ర‌మ‌ణ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాజీ, మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖర్ రావు క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడారు. అన్ని ర‌కాల కేసుల్లో ఐఏఎంసీ మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని ప్రోత్స‌హిస్తుంది. అతి త‌క్కువ వ్య‌యంతో స్వ‌ల్ప స‌మ‌యంలో కేసుల‌ ప‌రిష్కార‌మే ఐఏఎంసీ ల‌క్ష్య‌మ‌న్నారు. దేశంలో ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్ ప్ర‌క్రియ‌కు సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌న్నారు.

ఆర్బిట్రేష‌న్, మీడియేష‌న్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాముఖ్య‌త ఉంద‌న్నారు. ఐఏఎంసీ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని పేర్కొన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైద‌రాబాద్ అన్ని విధాలా అనుకూలంగా ఉంద‌న్నారు. ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తానికి హైద‌రాబాద్ వార‌ధి లాంటిద‌ని తెలిపారు. రాజీ, మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో ఐఏఎంసీ కీల‌కపాత్ర పోషిస్తుంద‌న్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఐఏఎంసీ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల స‌ల‌హాలు అందుబాటులో ఉంటాయి. వివాదాల ప‌రిష్కారంలో జాప్యం జ‌రిగితే న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. ఇరుప‌క్షాల అంగీకారంతో త్వ‌రిత‌గ‌తిన కేసులను ప‌రిష్కారం చేయొచ్చు అని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles