BJP MP And WFI President, Slaps Wrestler On Stage వేదికపైనే రెజ్లిర్ ను చెంపదెబ్బలు కొట్టిన బీజేపి ఎంపీ

Video shows bjp mp slapping wrestler on stage at sports event

Brijbhushan Sharan Singh, Wrestling Championship, Shaheed Ganpat Rai Indoor Stadium, national championship, Ranchi, Jharkhand

A BJP MP has been caught on camera slapping a wrestler during a national championship event in Jharkhand capital Ranchi. Brijbhushan Sharan Singh, who is also the president of the Wrestling Federation of India, was seen in the video hitting the young wrestler twice before he left the stage.

ITEMVIDEOS: వేదికపైనే రెజ్లిర్ ను చెంపదెబ్బలు కొట్టిన బీజేపి ఎంపీ

Posted: 12/18/2021 03:38 PM IST
Video shows bjp mp slapping wrestler on stage at sports event

జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న  అండర్ 15 జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీలలో బీజేపీకి చెందిన ఎంపీ ఒక యువ రెజ్లర్‌ చెంప చెల్లుమనిపించారు. ఈ దృశ్యాలు ఆ పోటీలను కవర్ చేస్తున్న అక్కడి మీడియా సంస్థలు తమ కెమెరాలు బంధించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పోటీలను అస్వాధిస్తున్న సభావేదిక పైనే ఆయన ఈ చర్యలకు పాల్పడటంతో ఒక్కసారిగా రెజ్లింగ్ పోటీ నిర్వాహకులతో పాటు స్థానికులు విస్తుపోయారు. వెంటనే తేరుకున్న నిర్వాహకులు జోక్యం చేసుకుని యువ రెజ్లర్ ను అక్కడి నుంచి పంపించి వేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని కైసార్ జంగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికకగా జరుగుతున్న అండర్ -15 రెజ్లర్ ఛాంఫియన్ షిప్ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాంచీలోని షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలలో తొలి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. వయసు రీత్యా తనను పోటీకి అనుమతించడం లేదని రెజ్లర్ సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. నిర్వాహకులు తనను పాల్గొనేందుకు అనుమతించనప్పటికీ, అండర్ - 15 కేటగిరీలో పాల్గొనేందుకు అనుమతించాలని ఆటగాడు అభ్యర్థిస్తూనే ఉన్నాడు. దీంతో ఎంపీ ఆగ్రహంతో స్టార్‌ను కొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles