South Africa-returnee tests positive for coronavirus in Srikakulam శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు నమూనాలు

South africa returnee tests positive for coronavirus in srikakulam

COVID-19, coronavirus, Srikakulam, santha bommali, south africa returnee, Tested positvie, Omicron variant, samples, genome sequence, south africa, London, Mumbai, Vizag, tested negitive at Mumbai airport, corona Vaccine, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, Andhra Pradesh

Tension escalated among the residents of Santhabommali, Srikakulam fearing of Omicron variant after a person who returned from South Africa tested positive for the coronavirus. According to the reports, a 51-year-old person returned from South Africa and tested positive for Coronavirus 15 days after he reached Srikakulam. The health department officials sent his samples to Hyderabad for genome sequence to know whether it is Omicron or not.

ITEMVIDEOS: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు నమూనాలు

Posted: 12/08/2021 10:46 AM IST
South africa returnee tests positive for coronavirus in srikakulam

ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటు మన దేశంలోనూ 23 మందికి సోకిందన్న వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. జిల్లాలోని సంతబోమ్మాలి మండలానికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడటంతో ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే వైద్యశాఖ అధికారులు మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు బాధితుడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. నివేదికలు వచ్చిన తరువాత కానీ తాము ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్థారించలేమని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సంతబోమ్మాలి మండలం పరిధిలోని ఉమిలాడ గ్రామవాసి ఇటీవల దక్షిణాఫ్రికా దేశం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి చేరకున్నాడు. అయితే ఆయన చేరుకున్న రోజున బాగానే వున్నా.. నిన్న ఆయన కొంత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా వైరస్ సోకిందని నిర్థారణ అయ్యింది. అయితే ఆయన సౌతాఫ్రికా నుంచి రావడంతో గ్రామంలోని వారంతా ఆయనకు ఒమిక్రాన్ వైరస్ సోకిందని భయాందోళన చెందుతున్నారు.

కాగా వైద్యాధికారులు మాత్రం ఇప్పుడే బాధితుడికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి సోకిందని నిర్థారించలేమని అన్నారు. బాధితుడి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ కు పంపామని.. నివేదికలు వచ్చిన తరువాత కానీ ఏ వేరియంట్ సోకిందన్న విషయమై స్పష్టత వస్తుందని అన్నారు. కాగా బాదితుడు సౌతాఫ్రికా నుంచి లండన్ కు వెళ్లి.. అక్కడి నుంచి ముంబైకి చేరుకున్నాడు. దీంతో ముంబైలోని వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేయగా, అతనికి కరోనా లేదని నిర్థారణ అయ్యిందని తెలిపాడు. అక్కడి నుంచి వైజాగ్ కు చేరుకుని.. సోంత గ్రామానికి చేరుకున్న తరుణంలో బాధితుడు కరోనా బారిన పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles