Youth climbs tree to escape Covid vaccination in Telangana కరోనా వాక్సీన్ వద్దంటూ.. చెట్టు ఎక్కిన యువకుడు..

Youth climbs tree to escape covid vaccination in telangana

COVID-19, Indian Medical Association, coronavirus, Sangareddy, Nyalkal, Rechintal village. Health workers, Ghousuddin, corona Vaccine, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron india, covid, delta variant, omicron symptoms,

Even after many alerts from the Centre and state government, many people are still ignoring to take the Covid-19 vaccine to fight against the invisible virus. A similar incident took place in Rechintal Mandal, Sangareddy. According to the information, a person identified as Gousuddin climbed a tree to escape the Covid vaccine when the health workers visited his house to administer the vaccine.

ITEMVIDEOS: కరోనా వాక్సీన్ వద్దంటూ.. చెట్టు ఎక్కిన యువకుడు..

Posted: 12/08/2021 09:52 AM IST
Youth climbs tree to escape covid vaccination in telangana

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాలకు విస్తరించడం.. ఇక తొలిసారిగా వెలుగుచూసిన సౌతాఫ్రికాలో కాకవికళం చేసేలా 25 శాతానికి పాజిటివిటీ రేటు పెరగడం ప్రపంచదేశాలను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు శాతంగా వున్న పాజిటివిటీ రేటు ఏకంగా 25శాతానికి పెరగడంతో ప్రపంచదేశాలు హడలెత్తిపోతున్నాయి. రోజువారి కేసులు ఏకంగా పదివేలకు పైగానే నమోదువుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో నాలుగోదశ భీభత్సం కోనసాగుతోంది. దీంతో ఆ దేశం ప్రధానంగా వాక్సీనేషన్ పై దృష్టి సారించింది.

ఇదే సమయంలో అన్ని దేశాలు సంపూర్ణ వాక్సీనేషన్ పై దృష్టి సారించాయి. ఒమిక్రాన్ ను నియంత్రించడానికి ఇదొక్కటే తరుణోపాయమని ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు కరోనా వాక్సీన్ తీసుకోనివారిని గుర్తించి వారికి తప్పనిసరిగా వ్యాక్సీన్ ఇవ్వాల్సిందిగా ఐఎంఏ సూచనలు చేసింది. ఇక ఒక్క డోసు తీసుకున్నవారికి కూడా నిర్ణీత సమయంలో మరో డోస్ వాక్సీన్ ఇవ్వాలని అదేశించింది. దీంతో పాటు 12 ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్యనున్న చిన్నారులకు కూడా వాక్సీన్ ఇవ్వాలని సూచించిన ఐఎంఏ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరో డోస్ వాక్సీన్ ఇవ్వాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియంట్ పేరు వినగానే ఇన్నాళ్లు వాక్సీన్ తీసుకోని వారు వెళ్లి వాక్సీన్ తీసుకుంటున్నారు.

గత కొన్నాళ్లుగా జనం లేక వెలవెలబోయిన వాక్సీనేషన్ కేంద్రాలు.. ఒమిక్రాన్ వేరియంట్ బీభత్సం సృష్టిస్తోందని తెలియడంతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం పరిధిలోని రేచింతల్ గ్రామంలో ఆరోగ్యశాఖ కార్యకర్తలు సంపూర్ణ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజలందరికీ వాక్సీన్ ఇచ్చేందుకు వెళ్లారు. అయితే వారి జాబితాలో వున్న గౌసుద్దీన్ అనే ఓ యువకుడి పేరు వాక్సీన్ తీసుకోని వ్యక్తిగా నమోదై వుంది. దీంతో అతడికి వాక్సీన్ ఇచ్చేందుక అతని ఇంటికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు చుక్కెదురైంది.

కరోనా వాక్సీన్ ఇచ్చేందుకు తమ ఇంటికి ఆరోగ్యకార్యకర్తలు వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న గౌసుద్దీన్ సమీపంలోని ఓ చెట్టు ఎక్కి.. తనకు వాక్సీన్ తీసుకోనని భీష్మించాడు. దాదాపు గంట పాటు అతడ్ని చెట్టు దింపడానికి ఆరోగ్య కార్యకర్తలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో గ్రామంలోని పెద్దలు కూడా వచ్చి.. తాము కూడా వాక్సీన్ తీసుకున్నామని.. ఏమీ కాదని చెప్పి.. నచ్చజెప్పినా.. గౌసుద్దీన్ వాక్సీన్ తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారితో పాటు గ్రామపెద్దలు కూడా తలపట్టుకోగా.. గౌసుద్దీన్ తండ్రి సర్థార్ అలి టీకా వేసుకోవడంతో వారు వెనుదిరిగారు. గ్రామంలో వందశాతం వాక్సినేషన్ లక్ష్యంగా అరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles