COVID-19 cases to increase from Jan 15 in Telangana: DPH సంక్రాంతి నాటికి ఒమిక్రాన్ తీవ్రం: తెలంగాణ డీపిహెచ్ శ్రీనివాసరావు

Covid 19 cases to increase from jan 15 in telangana dph

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron india, omicron,covid,delta variant,angelique coetzee,omicron symptoms,what are the symptoms of omicron,what are the symptoms of omicron virus, COVID booster dose in india, booster dose above 40 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

As per Telangana health authorities, COVID-19 cases are likely to increase in Telangana from January 15 onwards which raises concerns about the start of the third wave of the pandemic. Telangana Director of public health and family welfare (DPH) Srinivasa Rao, stated that the state has tripled its oxygen generating capacity and maintained 27 oxygen containers on reserve in anticipation of an increase in COVID-19 infections caused by the new variant, omicron.

ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రం.. అప్రమత్తత అవసరం: తెలంగాణ డీపిహెచ్ శ్రీనివాసరావు

Posted: 12/06/2021 12:23 PM IST
Covid 19 cases to increase from jan 15 in telangana dph

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మవుతున్న నేప‌ధ్యంలో తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 15 నాటికి రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా వుంటుందని అన్నారు. పండగల నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని.. ఇది రాష్ట్రంలో మూడవదశకు సైతం దారితీయవచ్చునని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇక ఫిబ్రవరిలో ఒమిక్రాన్ మరింత తవ్రతరమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని సూచనలు చేశారు.

కరోనా మూడవ దశ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. అర్హులందరూ కరోనా టీకా తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఇలాంటి స్వీయ జాగ్రత్తలతోనే థర్డ్ వేవ్ నుంచి బయటపడగలమని అన్నారు. అయితే లాక్ డౌన్ సమస్యకు పరిష్కారం కాదని దీంతో ఆ దిశగా ఎవ్వరూ అలోచించరాదని అన్నారు. రానున్న రోజుల్లో అవి ఉండే అవకాశం లేదన్నారు. ఈ నెలలో 1.03 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

ఒమిక్రాన్ బాధితులకు తీవ్రమైన లక్షణాలు లేకపోవడం కాసింత ఊరటనిచ్చే అంశమే అయినా.. రాష్ట్రంలో అక్సిజన్ నిల్వలతో పాటు కరోనా చికిత్సలో అవసరమయ్యే మందులను ముందుజాగ్రత్తగా స్టాక్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకిన వ్యక్తులకు తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వైరస్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం వంటివి నమోదు కాలేదని తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిందని, తెలంగాణలోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1 నుంచి రాష్ట్రానికి వచ్చిన 900 మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. వీరిలో 13 మందికి మాత్రమే కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, దీంతో వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని వివరించారు. కొవిడ్ కంటే తప్పుడు కథనాలే ఎక్కువ ప్రమాదకరమని, దయచేసి అలాంటి కథనాలను ప్రచారం చేసి ఆరోగ్యశాఖ మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని డాక్టర్ శ్రీనివాస్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : COVID-19  omicron symptoms  New Year  Christmas  Pongal  Omicron Alert  Telangana health Director  Telangana  

Other Articles