Jaqueline Fernandes allowed to leave Mumbai airport బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు ఊరట.. ఈడీ అధికారులు అదేశాలతో..

Bollywood actress jaqueline fernandes allowed to leave mumbai airport

ed chargesheet conman sukesh chandrasekhar gifts actor jacqueline fernandez rs 200 extortion case, jacqueline fernandez, jacqueline fernandez case, jacqueline fernandez money laundering, jacqueline fernandez sukesh chandrasekhar, jacqueline fernandez ed, jacqueline fernandez news, jacqueline fernandez salman khan, nora fatehi, sukesh chandrasekhar, bollywood, salman khan, money laundering, jacqueline fernandez extortion case, bollywood news, salman dabangg concert

Actor Jaqueline Fernandez was allowed to leave the Mumbai airport after being briefly detained based on a look out circular. The circular was issued by the Enforcement Directorate in connection with a Rs 200 crore extortion case involving conman, Sukesh Chandrasekar.

బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు ఊరట.. ఈడీ అధికారులు అదేశాలతో..

Posted: 12/06/2021 11:32 AM IST
Bollywood actress jaqueline fernandes allowed to leave mumbai airport

ముంబయి ఎయిర్ పోర్టులో చుక్కెదురైనా బాలీవుడ్ నటి, శ్రీలంక అందాలభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు స్వల్ప వ్యవధి తరువాత ఊరట లభించింది. ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు నేపథ్యంలో అమెను అదుపులోకి తీసుకన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అధికారుల నుంచి అదేశాల నేపథ్యంలో అమెను విడిచిపెట్టారు. ముంబై విడిచి ఆమె వెళ్లేందుకు అనుమతించారు. అయితే బాలీవుడ్ నటిని ఇమిగ్రేషన్ అధికారులు ఎందుకు అడ్డుకున్నారంటే.. ఆమెపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి కారణం ఏంటీ.. అమెను దేశం విడిచి వెళ్లకుండా ఆమెను నిలువరించడం ఎందుకన్న వివారాల్లోకి వెళ్తే.. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. విచారణ సమయంలో సుఖేశ్ జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు తెలిసింది. ఆమెకు సుఖేశ్ ఎంతో ఖరీదైన కానుకలు ఇచ్చిన విషయం కూడా బయటికి వచ్చింది. వాటిలో రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గుర్రం, రూ.9 లక్షల విలువ చేసే పిల్లి కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ పై కొన్నాళ్ల కిందట లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ముంబై విమానాశ్రాయానికి వచ్చిన నటి జాక్వెలిన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెను అడ్డుకున్న సిబ్బంది లుకౌట్ నోటీసులు విషయం వివరించి ఆమెను స్వల్ప వ్యవధి నిర్భందించారు. ఆ తరువాత విషయాన్ని ఈడీ అదఇకారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ అధికారులు అదేశాల నేపథ్యంలో అమెను విడిచిపెట్టారు. నటిని ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించే అవకాశాలు వున్నాయని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles