BJP workers' failure to explain Farm laws benefits: Uma Bharti రైతులను ఇన్నేళ్లలో సంతృప్తిపర్చిన ప్రభుత్వాలే లేవు: ఉమాభారతి

Farm laws repeal shows bjp workers failure to explain their benefits uma bharti

BJP Senior Leader, Uma Bharathi, Farm Laws, New Farm Laws, withdrawl, farmers, protests, MSP Law, Pm Modi, Uttar Pradesh, Politics

BJP leader Uma Bharti on Monday said Prime Minister Narendra Modi's sudden announcement to repeal the three controversial farm laws left her speechless as the move reflected failure of party workers to communicate properly benefits of the legislations to cultivators.

రైతులను ఇన్నేళ్లలో సంతృప్తిపర్చిన ప్రభుత్వాలే లేవు: ఉమాభారతి

Posted: 11/23/2021 01:24 PM IST
Farm laws repeal shows bjp workers failure to explain their benefits uma bharti

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ఉపసంహరణ కోసం ఏకంగా ఏడాది కాలంగా నిరసనలు తెలిపిన రైతులు.. తమ చెంతకు ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగినా.. రైతులు మాత్రం తమ నిరసనలను కొనసాగిస్తూనే వున్నారు. రైతుల ఉనికికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే మూడు వ్యవసాయ సాగు చట్టాల ఉపసంహరణ తరువాత.. తాజాగా అత్యంత కీలకమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ఉత్్పత్తులైన పంటంకు ఇచ్చే అత్యధిక విక్రయ దరపై చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులోనే తమ నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఉమా భార‌తి స్పందించారు. ప్రధాని నిర్ణయం తనను చాలా బాధించిందని అన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న త‌న‌ను క‌లచివేసింద‌ని ఆమె పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో జరిగిన రైతు ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వాలు దిగివచ్చినా.. రైతులకే తమ తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా.. రైతులు వారిని విశ్వసించలేదని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో కానీ, కృషితో కానీ రైతులు సంతృప్తి చెంద‌లేద‌న్నారు.

నూతన వ్య‌వ‌సాయ సాగు చ‌ట్టాలను రైతుల‌కు అర్థమయ్యేలా వివరించడంలో బీజేపి పార్టీ నేతలు, పూర్తిగా విఫలమయ్యారని అమె విమర్శించారు. సాగు చట్టాలను స‌మ‌గ్రంగా వివ‌రించ‌డంలో బీజేపీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. రైతుల‌కు స‌రైన ప‌ద్ధ‌తిలో ఎందుకు వివ‌రించ‌లేక‌ పోయార‌ని ప్ర‌శ్నించారు. ఈ నూతన సాగు చ‌ట్టాల విష‌యంలో విప‌క్షాల‌ను ఎదుర్కొలేక‌పోయామ‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే మూడు రోజుల త‌ర్వాత స్పందిస్తున్నాన‌ని తెలిపారు. మోదీ ఆ ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలో వార‌ణాసిలో గంగా న‌ది ఒడ్డున ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP Senior Leader  Uma Bharathi  Farm Laws  farmers  Pm Modi  Uttar Pradesh  Politics  

Other Articles