No scientific evidence for booster shot: Balram Bhargava బూస్టర్ డోస్ అవసరం లేదన్న ఐసీఎంఆర్ డైరెక్టర్

No scientific evidence to support need for booster vaccine dose against covid 19 icmr chief

covid, booster dose, booster shot, America, Coronavirus, corona vaccine, ICMR, chief, Balram Bhargava, ICMR Director, Covid-19 vaccine, India News

As several countries around the world are looking to give booster shots to people of different age groups, ICMR Director General Dr Balram Bhargava said on Monday that there is no scientific evidence so far to support the need for such a dose against COVID-19.

బూస్టర్ డోస్ అవశ్యకతపై శాస్త్రీయ ఆధారమే లేదు: ఐసీఎంఆర్

Posted: 11/23/2021 02:54 PM IST
No scientific evidence to support need for booster vaccine dose against covid 19 icmr chief

కరోనా మహమ్మారి నుంచి మరింత రక్షణ కోసం ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నవారికి కూడా మరో బూస్టర్ డోసు ఇచ్చేలా అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అటు అమెరికాతో పాటు పలు దేశాలు ఈ దిశగా ప్రచారాన్ని నిర్వహిస్తూ తమ దేశ పౌరులకు బూస్టర్ డోస్ అందిస్తున్నాయి. బూస్టర్ డోస్ తీసుకునేందుకు పలు రకాల తాయిలాలను కూడా ప్రకటిస్తున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ తో ఇబ్బందులను ఎదుర్కోంటున్న యూరోప్ దేశాలు కూడా అటు రెగ్యూలర్ డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా రెడీ కావాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాయి.

ఈ క్రమంలో మనదేశంలోనూ బూస్టర్ డోస్ తీసుకోవాలా.? అని చాలా మంది దేశ ప్రజల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి. బూస్టర్ డోస్ అంటే ఏమిటీ.? అది తీసుకుంటే కోవిడ్ నుంచి సంపూర్ణ రక్షణ పోందవచ్చా.? తీసుకోకపోతే ఎమౌంతుంది.? బూస్టర్ డోస్ ఎక్కడ తీసుకోవాలి అన్న ధర్మసందేహాలు అనేకం తెరపైకి వస్తున్నాయి. కాగా, బూస్టర్ డోస్ నేపథ్యంలో వినిపిస్తున్న వాదనలు, వార్తలపై ఎట్టకేలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ డైరెక్టర్ బలరామ్ బార్గవ స్పందించారు. బూస్టర్ డోసుతో శరీరానికి మరింత రక్షణ లభిస్తుందన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు.

కొవిడ్ నుంచి రక్షణకు బూస్టర్ డోసు అవసరమన్న దానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. దేశంలోని అర్హులందరికీ రెండో డోసు వేయించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో బూస్టర్ డోసు ఇచ్చే విషయమై చర్చించేందుకు భారత్‌లో టీకా కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) త్వరలో చర్చించనున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోసులు ఇస్తుండగా, మరికొన్ని అదే ప్రయత్నంలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid  booster dose  booster shot  corona vaccine  ICMR  chief  Balram Bhargava  India News  

Other Articles