Airtel raises tariffs, others could follow ఎయిర్ టెల్ సర్వీసు వాడుతున్నారా.? మీ జేబు ఇక గుల్లే.!

Airtel prepaid pack price increase by up to rs 501 from november 26

Airtel, Airtel price hike, Airtel best plans, Airtel recharge, Airtel prepaid plans, Airtel plans under Rs 250, Airtel Tarrif plans, Airtel new Tarrif plans, Airtel plans under 250, plans under 250, Airtel budget plans, Airtel news

Airtel has confirmed that it plans to revise its prepaid mobile plans in India starting November 26. While the minimum hike would be an increase of Rs 20 for some plans, some will see a higher price rise. While Airtel’s top-of-the-line Rs 2,498 combo prepaid plan will be priced at Rs 2,999, the Rs 1,498 Airtel plan will be priced at Rs. 1,799 once the change occurs.

ఎయిర్ టెల్ సర్వీసు వాడుతున్నారా.? మీ జేబు ఇక గుల్లే.!

Posted: 11/22/2021 07:02 PM IST
Airtel prepaid pack price increase by up to rs 501 from november 26

తన కస్టమర్లకు భారతీ ఎయిర్ టెల్‌ సంస్థ పెద్ద షాకే ఇచ్చింది. టారిఫ్‌ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీ-పెయిడ్‌ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్‌ అప్‌ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్‌ మీద పది రూపాయల మినిమమ్‌ పెంపును ప్రకటించింది. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్‌ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్‌ టారిఫ్‌ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. దీంతో పాటు అన్ని ప్లాన్లపై ఈ పెంపు వర్తించనుందని ప్రకటించింది.

ఇక డాటా టాప్‌ అప్స్ లో 48 రూ. అన్ లిమిటెడ్‌ 3జీబీ డాటా ప్యాక్ ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్‌ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్‌ సబ్ స్క్రయిబర్స్ కు వర్తింప జేయనున్నాయి. యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ARPU) కింద 200 నుంచి 300 రూ. అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు" దారి తీస్తుందని,  భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌లెట్‌ పేర్కొంది.

ఇదిలా ఉంటే టెలికామ్‌ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ ఆగస్టులోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తాజా టారిఫ్‌ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్‌ మీడియాలో మీమ్స్‌ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి. కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని అధునాతన సాంకేతికతను అందిస్తామని చె్పడం విడ్డూరంగా వుందని.. జనం సోమ్ములో అందుబాటులోకి తీసుకువచ్చే అదునాతన సాంకేతికతను కూడా డబ్బులకే విక్రయిస్తారు కానీ.. ఉచితంగా ఇవ్వరు. ఇది ఎయిర్ టెల్ గొప్ప వ్యాపారకోణమంటై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles