సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నా.. మరీ వేగంగా దూసుకెళ్లినా లేక నిర్ణీత వేగం కన్నా మరీ నెమ్మదిగా నడిపిస్తున్నా.. ట్రాఫిక్ ను బ్లాక్ చేస్తున్నారే అని మనకు చాలా కోపం వస్తుంది. మేం పనిమాళ రోడ్డుపైకి వచ్చామా.? లేక వీరు వచ్చారా.? ఏంటో మరీ ఈ విపరీత ధోరణి అని అనుకుంటాం. ఎందుకంటే రోడ్లపై మరీ ర్యాష్ గా వెళ్లినా.. లేక మరీవేగంగా వెళ్లినా.. లేక నిర్ణత స్పీడు కంటే నెమ్మెదిగా వెళ్లినా.. అది ప్రమాదాలకు, లేక ట్రాఫిక్ జామ్ లకుకారణం కావచ్చు. ఇక మరికొందరు రోడ్డుపైనే పక్కకు తమ వాహనాలను అపేసి వెళ్లాలా.? వద్దా అన్న మిమాంసాలో ఉంటారు. వీరి వల్ల భయంకరమైన ప్రమాదాలు జరిగే అస్కారం లేకపోలేదు.
వీళ్లకు అస్సలు డ్రైవింగ్ సెన్స్ లేదు.. ప్రమాదాలు జరుగుతున్నా.. బుద్ధి రాదు.. అని అనుకుంటాం.. ఇక అక్కడితో ఆగకుండా.. వారిని ఓవర్ టేక్ చేసిమరీ వారి వాహనంలోకి ఓ టుక్ వేసి ఇదేం డ్రైవింగ్ రా బాబు అన్నట్టుగా చూస్తాం. అది మానవ సహజం. సహనం కోల్పోయిన వారైతే ఓ మాట కూడా అనేస్తారు. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదపు అంచున నిలేచేలా చేసింది. అయితే ఇలాగే రియాక్ట్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఈ కారు డ్రైవర్ కూడా ఆ కారులోకి ఓ టుక్ ఇచ్చాడు. అయితే కారులోకి చూస్తూనే అతడి కోపం అంతా పోయింది. ఎందుకన్న వివరాల్లోకి వెళ్తే..
ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు.
అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి..
Man sacrifices his car to save another driver who was unconscious..
— Buitengebieden (@buitengebieden_) November 21, 2021
Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more