శాస్త్రసాంకేతిక రంగంతో పాటు యుద్దాలకు సంబంధించిన ఆయుధాల తయారీలో అగ్రగామిగా వున్న రష్యాపై మరో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆ దేశం చేసిన పని ఇప్పుడు ప్రపంచ దేశాల ఉపగ్రహాలకు సమీప భవిష్యత్తులో ఎనలేని నష్టాన్ని ఒనగూర్చే ముప్పు పొంచివుందని అమెరికా మండిపడుతోంది. దానికి కారణం, అంతరిక్షంలోని తమ సోంత శాటిలైట్ ను రష్యా పేల్చివేయడమే. రష్యా తాజాగా యాంటీ శాటిలైట్ క్షిపణిని తయారు చేసింది. దీనిని పరీక్షించడం కోసం అంతరిక్షంలోని తన సొంత శాటిలైట్ ను ఏమాత్రం గురితప్పకుండా పేల్చివేసింది.
అయితే, దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా ఉపగ్రహాన్ని రష్యా పేల్చి వేసిందని వ్యాఖ్యానించింది. శాటిలైట్ ను పేల్చివేయడం ద్వారా దాని శకలాలు అంతరిక్షంలో పెద్ద ఎత్తున ఉత్పన్నమయ్యాయని తెలిపింది. సుమారు 1500 పెద్ద శకలాలు ఉత్పన్నమయ్యాయని, వేల సంఖ్యలో చిన్న పరిమాణంలో శిథిలాలు ఉన్నాయని చెప్పింది. ఈ పరీక్ష వల్ల అన్ని దేశాలకు సమస్య వచ్చిందని... స్పేస్ స్టేషన్ కు కూడా ముప్పు ఉందని విమర్శించింది. అంతరిక్షాన్ని కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తున్న రష్యా చర్యలను తీవ్రంగా అక్షేపించింది.
ఈ మేరకు అమెరికా అంతరిక్షశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. జగత్తులో దేశాలు సృష్టిస్తున్న విపత్తులు చాలదన్నట్లు రష్యా.. అంతరిక్షంలోనూ విపత్తు ఉపక్రమించే చర్యలను చేపట్టిందని దుయ్యబట్టారు. అంతరిక్షంలోని ఉపగ్రహ శఖలాలతో ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారని... వారిలో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒక జర్మన్ ఉన్నారని తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల వ్యోమగాములకు తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more