Bombay HC to Nawab Malik: Reply to defamation suit ముంబై డ్రగ్స్ కేసు: ఫడ్నావిస్ కు నవాబ్ మాలిక్ అల్లుడు నోటీసులు..

Minister nawab malik son in law sends legal notice to devendra fadnavis

Sameer wankhede, Nawab Malik, Bombay High Court, Devendra Fadnavis, Sameer Khan, Drugs, Narcotics Control Bureau (NCB), BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

Maharashtra minister Nawab Malik's son-in-law Sameer Khan who was arrested in a drug-related case early this year and is now out on bail has sent a legal notice to BJP leader and former Maharashtra chief minister Devendra Fadnavis, demanding ₹5 crore damages for 'mental torture, agony, financial loss and injury' inflicted to his reputation because of Fadnavis' statement on a television channel.

ముదురుతున్న ముంబై డ్రగ్స్ కేసు: ఫడ్నావిస్ కు నవాబ్ మాలిక్ అల్లుడు నోటీసులు..

Posted: 11/11/2021 04:01 PM IST
Minister nawab malik son in law sends legal notice to devendra fadnavis

ఎన్సీపీ నేత‌, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే మధ్య సాగిన మాటల యుద్ధం క్రమంగా రాజకీయ మలుపు తీసుకుని ముదిరి పాకానపడుతోంది. మంత్రి నవాబ్ మాలిక్ ను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి రాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నావిస్ టార్గెట్ చేశారు. నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు తమను అప్రతిష్టను అపాదించి పెడుతున్నాయని తక్షణం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఫడ్నావిస్ సతీమణి కూడా మంత్రి నవాబ్ మాలిక్ పై పరువునష్టం దావాను వేసిన విషయం తెలిసిందే.

కాగా తన ఇంట్లో డ్రగ్స్ దొరికాయని దేవంద్ర ఫడ్నావిస్ చేసిన వ్యాఖ్యలపై తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి నవాబ్ మాలిక్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు వున్నాయని, ఆయన ఇంట్లో డ్రగ్స్ కూడా లభించాయని దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఫడ్నావిస్ తీవ్ర అరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తక్షణం ఫడ్నావిస్ వెనక్కు తీసుకోకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మంత్రి మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ఫడ్నావిస్ కు లీగల్ నోటీసులు పంపారు. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ అరోపణలతో తన పరువుకు భంగం వాటిల్లిందని ఆయనపై అయిదు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం దావాను వేసిన‌ట్లు తెలిపారు. మాలిక్ కూతురు నీలోఫ‌ర్ మాలిక్ ఖాన్ లీగ‌ల్ నోటీసుకు చెందిన కాపీని ఇవాళ రిలీజ్ చేశారు. లాయ‌ర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా ఆ నోటీసులు ఫ‌డ్న‌వీస్‌కు పంపారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 13వ తేదీన స‌మీర్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్ర‌గ్ కేసులో అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 27వ తేదీన అత‌న్ని రిలీజ్ చేశారు. మంత్రి మాలిక్ అల్లుళ్లు డ్ర‌గ్స్‌తో దొరికార‌ని ఇటీవ‌ల ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు.

అయితే ఎన్సీబీ దాఖ‌లు చేసిన చార్జీషీట్‌లో త‌మ‌పై ఎటువంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని మాలిక్ అల్లుడు త‌మ లీగ‌ల్ నోటీసులో తెలిపారు. జ‌న‌వ‌రి 14వ తేదీన ఇచ్చిన పంచ‌నామా ప్ర‌కారం త‌మ ఇంట్లో మాద‌క ద్ర‌వ్యాలు దొర‌క‌లేద‌ని, మీరెలా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని లీగ‌ల్ నోటీసులో మాలిక్ అల్లుడు ప్ర‌శ్నించాడు. ఫ‌డ్న‌వీస్ స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నామ‌ని, ఆ త‌ర్వాత త‌మ త‌దుప‌ది చ‌ర్య‌లు మొద‌లుపెడుతామ‌ని మాలిక్ కూతురు చెప్పింది. ఫ‌డ్న‌వీస్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే, తాము న‌ష్ట‌ప‌రిహారం దావాతో కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.

ఇదిలావుండగా, తన కుమారిడిపై.. మంత్రి న‌వాబ్ మాలిక్‌ చేసిన ఆరోపణలపై బాంబే హైకోర్టును ఆశ్రయించి.. పరువునష్టం పిటీషన్ దాఖలు చేసిన ఎస్సీబి అధికారి సమీర్ వాంఖేడ్ తండ్రి పిటీషన్ ను న్యాయస్థానం ఈ నెల 12కు వాయిదా వేసింది. అంతకుముందు ఈ పిటీషన్ పై విచారణ చేసిన న్యాయ్థానం ఓ రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఆయన చేసిన అరోపణలన్నీ వాస్తవాలని నిర్ధారించేలా అఫిడెవిట్ దాఖలు చేయాలని అదేశించింది. అయితే అది ఒక్క పేజీ ఉన్న అఫిడెవిట్ అయ్యిఉండాలని న్యాయస్థానం పేర్కోనింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  Sameer Khan  Drugs  Sameer wankhede  Nawab Malik  Aryan Khan  Bombay High Court  Mumbai  Crime  

Other Articles