Man held for cheating 20 women with hair wig photo విగ్గుతో యువతులను మోసం చేసిన కేటుగాడు అరెస్ట్

Hyderabad police arrested a man for cheating 20 women with hair wig photo

Sheik Mohammed Rafi, Hyderabad Task Force, Hyderabad North Zone police, SR Nagar police station, Kukatpally Police station, cheating, blackmailing, Unmarried Women, wig, Instagram, NRI, Telangana, Andhra Pradesh, Crime

Task Force (North Zone) police arrested Sheik Mohammed Rafi in Hyderabad for cheating 20 women in Telangana and Andhra Pradesh by trapping them using hair wig photo on his Instagram handle. According to police, the accused used to claim that he is an NRI and searching for a suitable match.

ITEMVIDEOS: విగ్గుతో యువతులను మోసం చేసిన కేటుగాడు అరెస్ట్

Posted: 11/11/2021 02:58 PM IST
Hyderabad police arrested a man for cheating 20 women with hair wig photo

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ మహాకవి శ్రీశీ.. రానున్న మోసాలను, దగాల గురించి దశాబ్దాల ముందుగానే చె్ప్పినా.. మనిషిలోని ఆశ ఎదుటివారు ఎత్తలకు చిత్తయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లు ఇత్తడిని పుత్తడి అని నమ్మించిన వారిని చూశాం.. పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్లిపోయినవాళ్లనూ చూశాం. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లు.. అరచేతిలో వైకుంఠం చూపించి డబ్బును ఎగేసుకుపోయిన వాళ్లకు మన రాష్ట్రంలో కొదవేలేదు. రాయి కూడా వెలుతురు పడితే మెరుస్తుందని తెలిసినా.. అది వజ్రం కాదని చేతులు కాలితే కాని తెలుసుకోలేకపోతున్నాడు.

ఎదుటివారి డాబు, దర్పాన్ని అద్దెకు తెచ్చకున్నాయని గ్రహించడానికి మనిషిలోని ఆశ అడ్డుపడుతుంది. మీ నిర్లక్ష్యమే పెట్టుబడిగా పెట్టుకునే మోసగాళ్లు మాత్రం అందినకాడికి దండుకుని శఠగోపం పెడుతున్నారు. కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే సన్నివేశాలను నిజజీవితంలోనూ ప్రదర్శిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అమాయక యువతులను పెళ్లిపెరుతో మోసం చేస్తున్నారు. మాయమాటలు, కనబడని చేష్టలతో పాటు ఈ కంత్రి ఫెల్లో కేవలం తలకు పెట్టుకునే విగ్గునే పెట్టుబడిగా పెట్టుకుని.. ఒక్కక్కరి వద్ద ఒక్కో పేరు చెబుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 20 మంది అమ్మాయిలను మోసం చశాడు.

ఇతని చేతుల్లో మోసపోయిన ఓ యువతి ఎస్ఆర్ నగర్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేటుగాడిపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి వెళ్లింది. ఈ క్రమంలో దీనిని సవాల్ గా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. అయితే విగ్గు లేకుండా, విగ్గు పెట్టుకుని ఉన్నప్పుడు ఈ మోసగాడిలో చాలా వత్యాసాలు వుండటంతో అతడ్ని కనిపెట్టడం కష్టంగా మారినా.. ఎట్టకేలకు పట్టుకున్నారు. కాగా, కేటాగాడు తన గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారని తెలుసుకుని విగ్గులేకుండా రోడ్లపై తిరుగుతున్నాడు.

అయితే నిందితుడ్ని పట్టుకుని తమదైన స్టైల్లో ట్రీట్ మెంట్ ఇవ్వగానే ఏకంగా 20 మందికి పైగా యువతులను పెళ్లి పేరుతో మోసం చేశానని అంగీకరించాడు. తాను ఎన్ఆర్ఐ (విదేశాలలో ఉంటే వ్యక్తి)నని చెప్పుకునే ఈ కేటాగాడు.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విగ్గుతో దిగిన ఫోటోలు పోస్టు చేసి.. యువతులను ట్రాప్ చేసేవాడు. వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వారితో సహజీవనం చేసేవాడు. ఇలా కొంతకాలానికి వారిని తనతో క్లోజ్ గా వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింది.. వారి నుంచి అందినకాడికి డబ్బు దస్కం లాగేవాడు. అయితే ఇతడి వలలో పడి ఏకంగా రూ.70వేలతో పాటు 18 తులాల బంగారం సమర్పించిన యువతి ఎస్ఆర్ నగర్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.

పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలుసుకుని విగ్గు లేకుండా తిరుగుతున్న ఇతగాడిని ఎంతో కష్టపడి పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తరువాత కూడా ఇతగాడు కాదని వదిలేయబోయి.. విచారించడంతో అసలు కథ బట్టబయలు అయ్యింది. ఈ కేటుగాడి అసలు పేరు షేక్ మహహ్మద్ రఫీ.. కానీ యువతలను ట్రాప్ చేయడానికి తన పేరును కార్తీక్ వర్మగా మార్చుకున్నాడు. అదే పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచి తన జట్టుతో ఉన్న ఫోటోలను పోస్టు చేసి.. ఐటీ పరిశ్రమలో పనిచేసే యువతులను టార్గెట్ చేశాడు. అంతేకాదు.. ఈ నిందితుడికి ఇప్పటికే పెళ్లైంది. ఇతగాడి వ్యవహారాన్ని పసిగట్టిన అతడి భార్య అతడి నుండి పెళ్లైన కొద్ది రోజులకే విడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheik Mohammed Rafi  Task Force  cheating  blackmailing  Unmarried Women  wig  Instagram  NRI  Telangana  Andhra Pradesh  Crime  

Other Articles