Will win Forth comming Assembly Elections వెన్నుపోటు పోడిచింది.. బయటకు గెంటింది కేసీఆరే: ఈటల

Amid back stabbed by kcr voters of huzurabad rescued me etela rajender

Etela Rajender, BJP, TRS, Huzurabad, Gellu Srinivas, Dalitha Bandhu, Harish Rao, TRS KCR, Chief Minister K Chandrashekhar Rao, Gellu Srinivas Yadav, Harish Rao, PeddiReddy, Central Election Commission, by-election, Huzurabad by-election, Huzurabad bypoll, Huzurabad, Huzurabad Assembly constituency, Telangana By-Polls, Telangana, Politics

Eetala Rajender, who won the by-election to the Huzurabad said that their party will win the forth comming Assembly elections. He alleged that the Rulign TRS party is propagading his as Back stabber, but said the people of Telangana are very much aware of the same. TRS party has thrown him out never i came out of the party said the Huzurabad winner.

వెన్నుపోటు పోడిచింది.. బయటకు గెంటింది కేసీఆరే: ఈటల

Posted: 11/03/2021 01:39 PM IST
Amid back stabbed by kcr voters of huzurabad rescued me etela rajender

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ 24 వేల ఓట్ల మెజారీటీతో తన ప్రత్యర్థి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. హుజూరాబాద్ అసెంబ్లీ నుంచి అందివచ్చిన విజయంతో.. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుని అసెంబ్లీ పై కూడా బీజేపి పతాకాన్ని ఆవిష్కరిస్తామని ఈటెల అన్నారు. ఆయనకు విజయం సమకూరిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా శుభాకాంక్ష‌లు తెలిపిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మరో రెండేళ్ల కాలంలో రానున్న త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో 'జేపీ న‌డ్డా జీ.. ఈ ఎన్నిక‌లో మాపై న‌మ్మ‌కం ఉంచి, మాకు మ‌ద్దతు తెలిపినందుకు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌ధాని మోదీ, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసేందుకు మీ సూచ‌న‌లు మమ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నాయి. వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి, మేము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాము' అని పోస్టు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమంలో చురుగా పాల్గోన్న తనను.. అధికారంలోకి వచ్చిన తరువాత వెన్నుపోటు పోడిచి.. తానే వెన్నుపోటు పోడిచానని దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. తతనను పొమ్మనకుండా పోగబెట్టి.. బయలకు గెట్టింది కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నితే కుట్రలు పన్నేవారే నష్టపోతారని పేర్కోన్నారు. 'గుర్తు పెట్టుకోండి.. కుట్ర‌దారుడు కుట్ర‌ల‌కు నాశ‌న‌మైపోతాడు. కుల సంఘాలు, భ‌వ‌నాలు, గుడుల‌కు డ‌బ్బులు ఇచ్చారు' అని విమర్శించారు. తన గెలుపు కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా పేర్కోన్నారు.

నన్ను ఓడించేందుకు ద‌ళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినా ప్ర‌జ‌లు నమ్మలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయ‌క‌పోతే ద‌ళిత బంధు నిలిపేస్తామ‌ని.. పింఛ‌న్లు ఆపేస్తామ‌ని వృద్ధుల‌నూ భ‌య‌పెట్టిందని.. ఆయనా తన ప్రజలు తనవైపునే నిలిచారని అన్నారు. ఉపఎన్నిక‌లో విజ‌యం కోస‌ం గ‌త ఆరు నెల‌లుగా టీఆర్ఎస్‌ సహా అధికార యంత్రాంగం ప‌నిచేసిందని ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. రాష్ట్ర ఖజానాకు చెందిన వంద‌ల కోట్ల రూపాయ‌లు ఆయన గత ఆరు మాసాలలో ఖ‌ర్చు పెట్టారని.. ఇలాంటి చర్యలపై తాను వ్యతిరేకమని అందుకనే తనను బయటకు పంపారని అన్నారు. తన విజ‌యాన్ని హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  BJP  TRS  Huzurabad  Gellu Srinivas  Dalitha Bandhu  Harish Rao  Telangana  AP  Politics  

Other Articles