Woman kisses Karnataka CM Basavaraj Bommai మహిళ అభిమాని అత్యుత్సాహం.. ఇబ్బంది పడిన సీఎం

Woman kisses karnataka cm basavaraj bommai video goes viral

Chief Minister Basavaraj Bommai, Women kissing CM's hand, Minister Ashwad Narayana, viral video, social media, mixed reactions, Netizens, Janasevac progremme, Palace Guttahalli, Karnataka, Trending video, video viral, Crime

A video of a woman kissing Karanataka Chief Minister Basavaraj Bommai's hand continuously is now going viral on social media and receiving mixed reactions from the netizens. The incident took place when the CM has participated in the Janasevac program at Palace Guttahalli.

ITEMVIDEOS: మహిళ అభిమాని అత్యుత్సాహం.. ఇబ్బంది పడిన సీఎం

Posted: 11/02/2021 07:17 PM IST
Woman kisses karnataka cm basavaraj bommai video goes viral

ప్రజాభిమానం ఒక్కోసారి హద్దులు దాటడం నేతలను ఇబ్బందికి గురిచేస్తుంటుంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ మహిళ కార్యకర్త వల్ల ఆయన ఇబ్బందికి గురయ్యారు. నలుగురిలో తన ఇబ్బందిని బయటపెట్టలేక.. మహిళ అభిమానిని ఏమీ అనలేక తనలో తానే నోచ్చుకున్నారు. అయితే కనీసం మహిళా అభిమానికైనా పదిమందిలో తన సంతోషాన్ని ఎలా ప్రదర్శించాలన్న విషయం తెలియకపోవడం గమనార్హం. ఇదిలావుండే ఉపఎన్నికల ఫలితాల్లో ఓ సీటును చేజార్చకున్న బీజేపి.. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తో ప్రజలను మభ్యపెట్టి.. వారి దృష్టి మళ్లించేందుకు జరిగే ప్రయత్నాలని విపక్షాలు అరోపిస్తున్నాయి.

అసలేం జరిగిందంటే.. జనసేవక కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మై అందులో భాగంగా బెంగళూరు గుట్టహళ్లి ప్రాంతానికి వెళ్లారు. భారీ జనసందోహం వెంటరాగా, ఆయన ఓ ఇంటిముందు ఆగారు. అయితే ఆ ఇంటి యజమానురాలు సీఎం అంతటివాడు తన ఇంటి ముందు ఆగడంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన ఆనందాన్ని ముద్దుల రూపంలో కురిపించింది. సీఎం బసవరాజ్ బొమ్మై చేతిని అందుకుని కళ్లకు అద్దుకుని, అదేపనిగా ముద్దులు పెట్టింది. దాంతో సీఎం బొమ్మై ఇబ్బందికరంగా ఫీలయ్యారు.

తన చేయిని ఆమె ఎంతకీ వదలకపోవడంతో ఆయన అసహనానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఇంటి ముంగిటకే పాలన తరహాలో జనసేవక పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 58 ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇళ్ల వద్దనే అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో భాగంగా బెంగళూరులోని 198 మున్సిపల్ వార్డుల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలును పరిశీలించేందుకే సీఎం బవసరాజ్ బొమ్మై నగరంలో పర్యటనకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles