Sabarimala Temple Opened for Chithira Atta Vishesha Festival మండల పూజల కోసం తెరుచుకోనున్న శబరిగిరీశుడి దేవాలయం

Sabarimala temple to opened for mandalam makaravilakku pilgrimage from nov 15

Sabarimala, Ayyappa Temple, Atta Chithira puja, Mandalam-Makaravilakku, Makaravilakku pilgrimage, virtual booking system, Covid-19, Sabarimala Temple, Thula Masam, Kerala, corona vaccine, RT-PCR negitive Report

Sabarimala temple opened for Chithira Atta ViVishesha Festival. Devotees were allowed entry in morning of Wednesday. The temple will reopen for the two-months long Mandalam-Makaravilakku pilgrimage season starting from 15 November.

మండల పూజల కోసం తెరుచుకోనున్న శబరిగిరీశుడి దేవాలయం

Posted: 11/03/2021 11:30 AM IST
Sabarimala temple to opened for mandalam makaravilakku pilgrimage from nov 15

కేరళలోని పతనంతిట్టా జిల్లాలో గల శ‌బ‌రిమ‌ల దేవాలయం పుణ్యద్వారాలు చితిర ఆట్టతిరునాల్ పండుగ నేపథ్యంలో తెరుచుకున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కొనసాగుతున్న క్రమంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు ముందుగానే ఆన్ లైన్ ద్వారా తమ స్లాట్ దర్శనాలు బుక్ చేసుకున్న భక్తులకే ఆల‌యంలోకి అనుమతి ఉంటుంది. ఇక కరోనా వాక్సీన్ రెండు డోసులు తీసుకున్న ధృవపత్రాలున్న భక్తులకు మాత్రమే ఆలయంలోనికి అనుమతి కల్పిస్తున్నారు. అయితే వాక్సీన్ తీసుకోని వారితో పాటు వాక్సీన్ ఒక్క డోసు మాత్రమే తీసుకన్న భక్తులు.. లేటెస్టు కరోనా నెగిటివ్ నివేదకను చూపించాల్సి వుంటుంది.

అక్టోబర్ మాసంలో హరహరపుత్రుడి దర్శనానికి వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకుని.. వరదల కారణంగా రాలేకపోయిన భక్తులకు కూడా ఆలయ అధికారులు ఇప్పడు అనుమతించారు. కాగా ఈనెల 15వ తేదీ నుంచి మకరవిళ్లక్కు మండల పూజ కోసం దేవాలయం రెండు నెల‌ల పాటు తెర‌వ‌నున్నారు. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు. కాగా, మండల పూజ క్రమంలో దేవాలయాన్ని దర్శించనున్న భక్తులు తప్పనిసరిగా తమ వర్చువల్ బుకింగ్ సిస్టమ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మలయాళీలకు తుల మాసం అత్యంత పవిత్రమైనది. దీంతో తుల మాసం పూజల నేపథ్యంలో ఆలయాన్ని తెరచి ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇక చితిర ఆట్టతిరునాల్ పండుగ నేపథ్యంలో తెరచిన ఆలయాన్ని నిన్న రాత్రి 9 గంటల తరువాత హరివాసన సేవ ముగించిన తరువాత మూసివేశారు. ఇదిలావుండగా, కేరళలో కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే వుంది. నిన్న ఒక్క రోజునే ఏకంగా ఐదు వేల 297 మంది కరోనా బారిన పడ్డారు. 368 మంది కరోనా బాధితులు అసువులు బాసారు. దీంతో ఇప్పటి వరకు కేరళలో 49.73లక్షల మంది కరోనా బారిన పడగా, వారిలో 32వేల 49 మందిని మహమ్మారి బలితీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles