Voting begins for bypoll to Huzurabad assembly seat హుజూరాబాద్ లో కొనసాగుతున్న ఉపఎన్నిక.. ఓటేసిన ఈటెల దంపతులు

Polling underway in telangana s huzurabad assembly constituency by election

TRS Party President, TRS KCR, Chief Minister K Chandrashekhar Rao, Gellu Srinivas Yadav, Harish Rao, PeddiReddy, Central Election Commission, by-election, Huzurabad by-election, Huzurabad bypoll, Huzurabad, Huzurabad Assembly constituency, Telangana By-Polls, Telangana, Politics

Polling was underway amid tight security in the by-election to the Huzurabad Assembly constituency in Telangana on Saturday. Polling started at 7 a.m. at 306 polling centres across the constituency in Karimnagar district. Election officials said the process will continue till 7 p.m. A little over 2.37 lakh voters are eligible to cast their votes.

హుజూరాబాద్ లో కొనసాగుతున్న ఉపఎన్నిక.. ఓటేసిన ఈటెల దంపతులు

Posted: 10/30/2021 10:49 AM IST
Polling underway in telangana s huzurabad assembly constituency by election

తన ఆత్మగౌరవం ముందు ఎలాంటి మంత్రి పదవులు పనిచేయవని, ఉద్యమంలో ఉన్న నేతలను పొమ్మనకుండా పోగబెట్టుతున్న టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ద్రోహులను పార్టీలో చేర్చుకుని అంతా సవ్యంగానే సాగుతుందని బిల్డప్ ఇస్తోందని అరోపిస్తూ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలపై యావత్ తెలంగాణ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలంగాణతో పాటు యావత్ తెలుగు ప్రజలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ అసెంబ్లీ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌ 262 పోలింగ్‌ బూత్ లో ఆయన ఓటు వేశారు. సతీసమేతంగా ఎన్నికల వేళ పోలింగ్ బూత్ వచ్చిన ఆయన అక్కడున్న ఓటర్లకు నమస్కరిస్తూ లోనికి వెళ్లారు. అనంతరం ఈటెల దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంతో ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉన్నారని అన్నారు. ఈటల అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దు, బొంద పెట్టాలని సీఎం కేసిఆర్ కుట్ర పన్నారని.. అయినా ప్రజలు తనవైపునే నిలిచారని అన్నారు.

ఉద్యమ నేపథ్యంలో తనకు తానుగా వెళ్లి ఉద్యమ పార్టీలో కలిసానని, ఇప్పుడు తెలంగాణ సాకారమైన తరువాత ఉద్యమద్రోహులు పార్టీలో చేర్చుకుని ఉద్యమనేతలను బయటకు పంపుతున్నారని భావోద్వేగంతో ప్రజలకు అప్పీల్ చేశానని అన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నా అని ఓటర్లను అభ్యర్థఇంచారు. వందల కోట్లు డబ్బులు పంచినా, మద్యం ఏరులై పారించినా ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. చరిత్రలో ఇలాంటి ఎన్నికను ఎప్పుడు చూడలేదని అవేదనను వ్యక్తం చేసినా ఆయన.. ఐదు నెలలుగా జనంలో ఉన్నా, కానీ ప్రలోబాలతో మూడు రోజుల్లోనే మార్చేశారని అందోళన వ్యక్తం చేశారు. ఇంత నీచంగా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేసిన పరిస్థితి చూడలేదు' అని ఈటల అన్నారు.


అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ.. సామాన్యుడైన రెండు ఎకరాల రైతును రెండు వందల ఎకరాల అసామితో పోటీ పడుతున్నాడని కూడా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. గెల్లును దీవించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ దాదాపు నెల రోజులుగా హుజూరాబాద్ లో మంత్రులు హరీశ్ రావు, గంగుల సహా పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు అక్కడే తిష్ట వేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని ప్రతీ ఓటరును కలసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూన్నారు. అటు టీఆర్ఎస్ నేతలతో పాటు ఇటు బీజేపి నేతలతో నియోజకవర్గంలో మునుపెన్నడూ కనిపించని ఎన్నికల కళ ఏర్పడింది.

ఇటు ఈటెల కూడా అధికార పార్టీపై తమ విమర్శలను ఎక్కుపెట్టారు. తాము నియోజకవర్గ ప్రజలను నమ్ముకుంటే.. అధికార పీఠంపైనున్న కేసీఆర్ డబ్బు మూఠలను, పరాయి మూకలను నమ్ముకుంటున్నారని విమర్శించారు. తనను ఓడించేందుకు అధికార పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. హూజూరాబాద్ ప్రజలు తనవైపునే వున్నారని అన్నారు. తనతో పోటీపడుతున్న రెండు ఎకరాల రైతు.. ఎన్నికలలో రెండు వందల కోట్ల రూపాయలు ఎలా ఖర్చుపెడుతున్నారని అవి ఎక్కడవని ఈటెల ప్రశ్నించారు. తనను గెలిపించి హూజూరాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలను ఈటల కోరిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eetala Rajender  BJP  By-Elections  Huzurabad By-poll  polling  CM KCR  Harish Rao  Gellu Srinivas  Telangana  Politics  

Other Articles