Voting underway at 3 Lok Sabha and 30 assembly seats 3 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్‌

Voting begins for bypolls in 3 lok sabha seats 30 assembly constituencies in 14 states

bengal, bihar, madhya pradesh,Bypolls 2021, By Election 2021, Huzurabad bypoll 2021, Maharashtra bypoll 2021, Assam bypoll 2021, Bihar bypoll 2021, West Bengal bypolls 2021, Rajasthan bypoll 2021, Bypoll, Bypolls in India, Assembly constituency, Lok Sabha seat, Election Commission

The voting for the Assembly and Parliamentary constituencies bypolls scheduled in five states across the country began on Saturday. The bypolls for assembly constituencies are underway in the states including West Bengal, Assam, Telangana, Andhra Pradesh, Karnataka, Rajasthan, Haryana and Madhya Pradesh.

ఉపఎన్నికలు: దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్‌

Posted: 10/30/2021 11:41 AM IST
Voting begins for bypolls in 3 lok sabha seats 30 assembly constituencies in 14 states

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. శనివారం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాలతో పాటు, 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్డా లోక్ సభ స్థానంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంటు స్థానానికి.. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దద్రానగర్ హవేలి లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు ఉధయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పరిధిలోని బద్వేల్ స్థానంతో పాటు తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. బద్వేలులో ఉదయం 9 గంటల సమయానికి 10.50 శాతం ఓటింగ్ కూడా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలోనూ ఉప ఎన్నికల కొలహలం బాగానే కనిపిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకుని పనులపై వెళ్లేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటలకు వరకు దాదాపు 10.5శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.


మరోవైపు అస్సోంలోని గోస్సాయ్ గావ్, భబాణీపూర్, తముల్ పూర్, మర్యాని, తోబ్రా అసెంబ్లీ స్థానాలకు.. బిహార్ లోని కుషేశ్వర్ అస్తాన్, తారాపూర్ అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని ఎలనాబాద్ అసెంబ్లీ స్థానానికి.. హిమాచల్ ప్రదేశ్ లోని ఫతేపూర్, అర్కి, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలకు, కర్ణాటకలోని సింద్గీ, హంగల్ అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్ లోని పృధ్వీపూర్, రాయ్ గావ్ అసెంబ్లీ స్థానాలకు, మహరాష్ట్రలోని డెగ్లూర్ అసెంబ్లీ స్థానానికి, మేఘాలయలోని మావ్రింగ్‌నెంగ్, మాఫ్లాంగ్, రాజబాల అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

మిజోరంలోని టుయిరియల్ అసెంబ్లీ సీటుకి, నాగాలాండ్ లోని షామ్‌తోర్-చెస్సోర్  అసెంబ్లీ స్థానానికి, రాజస్థాన్ లోని వల్లభనగర్, ధరియావాడ్ అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ ల్లొని దిన్హటా, శాంతిపూర్, ఖర్దహా, గోసబా, భబానీపూర్, సంసర్‌గంజ్, జంగీపూర్ అసెంబ్లీ స్థానాలతో పాటు ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కాగా మిజోరంలోని టుయిరియల్ అసెంబ్లీ స్థానానికి రికార్డు స్థాయిలో ఉదయం ఏడు గంటలకే 17 శాతం ఓటింగ్ నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bypoll  Bypolls in India  Assembly constituency  Lok Sabha seat  Election Commission  

Other Articles