Allahabad HC says live-in relationship is personal autonomy సహజీవన విధానంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

Allahabad high court sensational comments on live in relationship says it is personal autonomy

Allahabad High Court, live-in relationship, personal autonomy, social morality, right to life, personal liberty, Police, Justice Pritinker Diwaker, Justice Ashutosh Srivastava, Article 21 of the Constitution, Shaira Khatun, Zeenat Parveen, Uttar Pradesh, crime

The Allahabad High Court has stated that "live-in relationships have become part and parcel of life and need to be viewed from the lens of personal autonomy rather than notions of social morality."

సహజీవన విధానంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

Posted: 10/29/2021 01:09 PM IST
Allahabad high court sensational comments on live in relationship says it is personal autonomy

యువతీయువకుల సహజీవన శైలిపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సహజీవనం చేస్తున్న యువతీ యువకులు తమకు రక్షణ కావాలని అర్థించినా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంపై తీవ్రంగా మండిపడింది. "లివ్-ఇన్ రిలేషన్షిప్స్’’గా పిలవబడే సహజీవన ఘట్టాలు జీవితంలో భాగంగా మారిపోయాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. వీటిని సమాజ నైతికత కోణంలో చూడటం మానేసి వాటిని ఎంచుకునే యువతీయువకుల వ్యక్థిగత స్వేచ్ఛ కోణంలో చూడాలని తేల్చిచెప్పింది. సహజీవనం చేసే వ్యక్తులకు ఒకరిపై మరోకరికరికి వున్న అంతర్గద విశ్వాసాన్నే పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టును సహజీవనం చేస్తున్న రెండు వేర్వేరు జంటలు ఆశ్రయించి పిటీషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు పిటీషన్లను రెండు జంటల్లోని యువతులే దాఖలు చేశారు. అందులో ఒకరి పేరు షైరా ఖాతున్, స్థానిక ఖుషీనగర్ లో నివాసం ఉంటోంది. కాగా, మరో పిటీషన్ ను మీరట్ కు చెందిన జీనత్ పర్ వీన్ అనే యువతి దాఖలు చేసింది. తమ పిటీషన్లలో తాము మేజర్లమని వీరు పేర్కోన్నారు. తాము గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నామని, అయితే తమ దైనందిక జీవితాల్లో నిత్యం కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులను చవిచూస్తున్నామని ఈ జంటలు తమ వేర్వేరు పిటీషన్లలో పేర్కోన్నాయి.

కాగా తమ కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్వించాలని పోలీసులను ఆశ్రయించగా వారు తమకు సంబంధం లేదని.. తాము ఈ వ్యవహారాల్లో ఏమీ చేయలేమని చెబుతున్నారని వారు న్యాయస్థానానికి వివరించారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రితింకర్ దివాకర్, జస్టిస్ అషుతోష్ శ్రీవాత్సవలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తూ సహజీవనం విధానాన్ని న్యాయస్థానం అమోదిస్తున్నదని, వీటిని సామాజిక నైతక విలువల నేపథ్యంలో కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ కోణంలో అలోచించాలని పేర్కోంది. పౌరులకు జీవించే హక్కుతో పాటు వారి వ్యక్తిగత స్వేచ్చ హక్కును కూడా రాజ్యాంగంలోని అర్టికల్ 21 కల్పిస్తున్నది తేల్చిచెప్పింది.

తమకు ప్రాణాలకు హాని కలుగుతుందని.. జీవించే హక్కును కోల్పోనున్నామని ఎవరైనా పోలీసులను అశ్రయిస్తే వారిని హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని న్యాయస్థానం నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద పొందుపరిచిన జీవించే హక్కు పరిరక్షించబడాలని చెప్పింది. ఈ క్రమంలో పోలీసులను సంబంధిత సహజీవన జంటలు ఆశ్రయించాలని వారు తమ బాధ్యతను చట్టప్రకారం నిర్వర్తించాని న్యాయస్థానం అదేశించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మేజర్లయిన యువజంట విషయంలో ఢిల్లీ హైకోర్టు యూపీ పోలీసులపై తీవ్రంగా మండిపడిన నేపథ్యంలో పోలీసులు సహజీవన కేసుల్లో జోక్యం చేసుకోవడానికి వెనుకాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles