Swimmer Attacked By Alligator In Terrifying Video మొసలి దాడి నుంచి తృటితో తప్పించుకున్న ఈతగాడు

He tried to get away swimmer attacked by alligator in terrifying video

Alligator Chases Swimmer, Alligator, Swimmer, Horrifying Footage, Brazil, Alligator attack, Alligator Attack Video, trending videos, viral videos

A horrifying video has captured the moment an alligator chased and attacked a swimmer in Brazil. The incident took place Saturday at a forested spot with a lake that is popular with tourists. The Lago do Amor lake in Campo Grande, however, is off-limit for swimmers due to the presence of alligators, so when Willyan Caetano saw a man enter the prohibited waters, he began filming.

ITEMVIDEOS: భయానక వీడియో.. మొసలి దాడి నుంచి తృటితో తప్పించుకున్న ఈతగాడు

Posted: 10/26/2021 04:51 PM IST
He tried to get away swimmer attacked by alligator in terrifying video

నీటిలో ఉండగా తన వద్దకు ఎవరు వచ్చినా.. ఎవరి వద్దకు తాను వెళ్లినా.. ఎదుటి వారికే నష్టం అన్నట్లు వుంటుంది మొసలి వ్యవహారం. అలాంటిది నీటిలో హాయిగా ఈదుతున్న ఓ ఈతగాడిని ఎక్కడి నుంచి చూసిందో కానీ అతివేగంగా అతడిని సమీపించి.. ఒక్క ఉదుటున దాడి చేసింది. దాని గమనించిన ఈతగాడు తప్పించుకునే క్రమంలో ఒడ్డుకు ఈదుతున్నా మొసలి వేగంగా దూసుకువచ్చి దాడి చేసింది. చూడటానికే భయానకంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతుం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎందుకనో తెలుసుకోవాలంటే మ్యాటర్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందే.  

బ్రెజిల్ లోని పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన అటవీ ప్రదేశంలో ఉన్న సరస్సుతో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున క్యాంపో గ్రాండేలోని లాగో డో అమోర్ సరస్సు ఉంది. అందులో ఈత కోట్టడం నిషేధమని ఇప్పటికే అక్కడి స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అందుకు కారణం మొసళ్లు. లాగో డో అమోర్ సరస్సులో మొసళ్లు వున్నాయన్న కారణంగా చెరువులోకి దిగడం, ఈత కొట్టడంపై నిషేధ అంక్షలు కోనసాగుతున్నాయి, కానీ ఇది తెలియని ఒక వ్యక్తి ఆ సరస్సులోకి వెళ్లి ఈతకొట్టడం ప్రారంభించాడు. దీంతో నిషేధిత నీటిలోకి ప్రవేశించడాన్ని చూసిన విల్యన్ కేటానో అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో వీడియో తీయడం ప్రారంభించాడు.

తన మొబైల్ ఫోన్ లో వీడియోను రికార్డు చేస్తూనే మరోవైపు సమయం, స్థలంతో కూడిన వివరాలను చెబుతున్నాడు.. "సాయంత్రం 4:40 గంటలకు ప్రేవేశానికి నిషేధం వున్న సరస్సులోకి ఒక వ్యక్తి ప్రవేశించి.. ఈత కొట్టడం ప్రారంభించాడని చెప్పుకోచ్చాడు. అదే సమయంలో సరస్సులో దిగిన వ్యక్తిని చూసిన మొసలి అతన్ని కరుచుకునేందుక వేగంగా వచ్చింది. దురదృష్టవశాత్తు ఈతగాడిని వెంబడించింది. దానిని గమనించిన ఈతగాడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వేగంగా ఈతకొట్టడం ప్రారంభించాడు. అయినా అతివేగంగా దూసుకువచ్చిన మొసలి ఒక్క ఉదుటున అతనిపై దాడి చేసింది.

అయితే ఈ దాడిలో ఈతగాడి చెయిని మొసలి గాయపర్చింది. అయితే అది గాయం చేసినా తప్పించుకోవడంలో మాత్రం ఈతగాడు సఫలీకృతుడయ్యాడు. ఈ క్రమంలో అతను ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో మొబైల్ ఎమర్జెన్సీ కేర్ సర్వీస్‌ అధికారులు వచ్చి ఈతగాడిని అసుపత్రికి తరలించారు. ఈ సరస్సు వద్దే మూడేళ్లుగా చెరుకు రసం బండి నడుపుతున్న గారపెయిరా మరినాల్వా డా సిల్వా.. తాను మూడేళ్లుగా ఈ చెరువులోకి దిగినవారిని చూడలేదని తెలిపారు. ఇదే తొలిసారని అని చెప్పిన అమె.. ఈతగాడికి చెయ్యి తప్ప మరెక్కడా గాయలు కాలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles