SC Raps UP govt over Lakhimpur Kheri violence లఖింపూర్‌ ఘటనపై యూపీ సర్కార్ పై సుప్రీం ప్రశ్నలు

Lakhimpur kheri case thousands of farmers but only 23 witnesses sc questions up government

CJI, Justice NV Ramana, Supreme Court, Lakhimpur Farmers Killing, lakhimpur kheri violence, lakhimpur kheri violence case, lakhimpur kheri, farmers protest, ashish mishra, ajay mishra, Uttar pradesh, Crime

The Supreme Court has once again come down hard on the Uttar Pradesh government regarding the Lakhimpur Kheri violence that erupted earlier this month, asking the authorities to provide protection to the witnesses involved in the case.

లఖింపూర్‌ ఘటనపై యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన సుప్రీం

Posted: 10/26/2021 03:52 PM IST
Lakhimpur kheri case thousands of farmers but only 23 witnesses sc questions up government

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినా..న్యాయస్థానంలో విచారణ సందర్భంగా మాత్రం పోలీసులు, సిట్ అధికారులు అందోళనకు గురవుతున్నారు. ఇదివరకే ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం సంధించిన ప్రశ్నలు వేసిన చురకలతో వారు బెంబేలెత్తిపోయారు.

ఈ కేసును కూడా ఒడవని ముచ్చలా మార్చోద్దని ఇదివరకే వ్యాక్యాలు చేసిన న్యాయస్థానం అంతకుముందు ప్రభుత్వానికి కూడా అక్షింతలు వేసింది. ఘటన జరిగి పక్షం రోజులు దాటినా సిట్ అధికారులు నివేదికను సమర్పించడంలో మరెన్ని రోజులు కావాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండలో జర్నలిస్ట్‌ రమణ్‌ కశ్యప్‌, శ్యామ్‌ సుందర్‌ హత్య కేసు దర్యాప్తుపై విచారణ నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది.

లఖింపూర్‌ ఖేరి హింసాకాండ కేసు విచారణ సదర్భంగా యూపీ ప్రభుత్వానికి పలు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు పశ్నలు సంధించింది. ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు..?, సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. 68 మందిని సాక్షులుగా గుర్తించామని, 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు తెలిపారు.

ధర్మాసనం స్పందిస్తూ ర్యాలీలో వందలాది మంది రైతులు ఉన్నారని, కేవలం 23 మంది సాక్షులు మాత్రమే వచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. సాల్వే బదులిస్తూ వాగ్మూలం కోసం ప్రకటన జారీ చేశామని, వీడియో ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. విచారణ కొనసాగుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బలమైన సాక్షులను గుర్తించడం అవసరం, ఎవరైనా సాక్షులు గాయపడ్డారా? అని ప్రశ్నించింది. వీడియోను త్వరగా పరిశీలించాలని, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ఇవ్వాలని, సాక్షులకు పూర్తి బాధ్యత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి చెప్పింది. సాక్షులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles