Congress MLA thrashes youth for questioning performance ‘‘నువ్వేం చేశావ్..’’ నిలదీసిన యువకుడిపై ఎమ్మెల్యే దాడి

Punjab congress mla thrashes boy for asking what have you done

Punjab Congress MLA thrashes youth, Punjab Congress, BJP, 2022 Punjab assembly polls, congress mla slaps, congress mla slaps video, congress mla joginder pal, congress punjab slap video, Sukhjinder Singh Randhawa, Bhoa Assembly Constituency, Congress MLA, Bhoa Assembly Constituency, Pathankot, social media, Punjab, Politics, viral video

A Congress MLA, his security personnel and supporters in poll-bound Punjab were caught on video thrashing a youth, who asked what work the legislator had done for his village. Reacting sharply to the incident that took place Tuesday, the BJP termed it as the “intolerant face of the Congress”.

ITEMVIDEOS: ‘‘నువ్వేం చేశావ్..’’ నిలదీసిన యువకుడిపై ఎమ్మెల్యే దాడి

Posted: 10/20/2021 09:26 PM IST
Punjab congress mla thrashes boy for asking what have you done

రాజకీయ నాయకులు ఎప్పుడు సహనాన్ని, సంయమనాన్ని పాటించకపోయినా.. సరిగ్గా ఎన్నికల ఏడాది అందునా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం తప్పకుండా వాటిని బలవంతంగానైనా తెచ్చుకున్నట్లు నటిస్తారు. ఎందుకంటే వారిని తమ నియోజకవర్గంలోని ప్రజలు ఏమి కావాలన్న సమకూరుస్తామని చెబుతారు. ఎవరు ఎలా నిలదీసినా.. దానికి బదులిస్తారు. కానీ పంజాబ్ లోని ఓ రాజకీయ నాయకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటారా.? తనను అభివృద్దిపై ప్రశ్నించిన ఓయువకుడి చెంప చెల్లుమనిపించాడు. ఏరా నీకు నేను సమాధానం చెప్పాలా.? అంటూ విరుచుకుపడ్డాడు.

ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని పఠాన్‌కోటలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో రాజకీయ దుమారం రేగింది. దీంతో అక్కడి అధికార పార్టీకి ఈ ఘటన తలనొప్పిగా మారింది. ఆ వీడియోలో.. పఠాన్‌కోట్ జిల్లాలోని బోయా నియోజకవర్గ ఎమ్మెల్యే జోగిందర్‌ పాల్‌ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగుతుండగా ఓ యువకుడి వచ్చి నియెజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని ప్రశ్నిస్తాడు. దీంతో అతని ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ యువకుడిని చెంప చెల్లుమనిపించారు.

అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులు, ఇతర నేతలు కూడా ఆ వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా ఈ అంశంపై మాట్లాడుతూ: "ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామని తెలిపారు. దెబ్బలు తిన్న ఆ యువకుడి తల్లి తన కుమారుడు ప్రజా నాయకుడిని ఒక సాధారణ ప్రశ్న అడిగినందుకు ఇంత దారుణంగా కొట్టడమేం‍టని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. పార్టీకే నష్టం కలిగించే చర్యలు చేయడంతో పార్టీ అధిష్టానం కూడా దృష్టిసారించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles