Europe, US are the only regions with rise in COVID-19: WHO ప్ర్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభస్తున్న కరోనా మహమ్మారి

Uk government refuses appeals for mitigations as covid third wave surge

coronavirus, coronavirus india, coronavirus india news, coronavirus news today, coronavirus news, coronavirus latest news, coronavirus update, coronavirus latest update, coronavirus in England, coronavirus in Russia, coronavirus in America, coronavirus in Itally, coronavirus india update, coronavirus delta AY variant, coronavirus third wave, coronavirus india roundup, coronavirus cases in india, coronavirus deaths in india, coronavirus death toll, coronavirus death toll india, third wave of corona, worldometer coronavirus, worldometer coronavirus india, corona virus data, worldometers corona virus, 3rd wave of covid in india, covid 19 coronavirus cases delhi

More than 300,000 new cases (311,071) were recorded in the week to October 19—an increase of nearly 20 percent. Only the United States (546,319), with a population five times that of Britain had a higher number of cases over the same seven-day period. COVID cases in the US were 1,638 per million of the population and in Britain were 4,551.

కరోనా ధర్డ్ వేవ్: ప్ర్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభస్తున్న మహమ్మారి

Posted: 10/21/2021 10:41 AM IST
Uk government refuses appeals for mitigations as covid third wave surge

కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తొలిసారి ప్రజల భయాందోళనల నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించినప్పటికీ విపరీతంగా ప్రభావం చూసిన కోవిడ్ అనేక మందిపై ప్రభావాన్ని చూపింది. ఇక రెండో దశలో మరింత వేగంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ తొలిసారి కంటే రెట్టింపు వేగంతో విజృంభించింది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ లలో మూడవ దశ ప్రభావం చూపుతుందన్న అంచనాలు మెళ్లిగా సన్నగిల్లాయి. కరోనా మహమ్మారి సాధారణ జలుబులా మారిందని.. ఇక దీంతో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా పలు అధ్యయానాలు వెల్లడించాయి.

అయితే ప్రజలకు కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం వంటి చర్యలకు రమారమి స్వస్తి పలికారు. కరోనాకు ముందున్న పరిస్థితులు తిరిగి వచ్చాయని.. అప్పటిలానే వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఆదమరిచి అప్రమత్తతకు స్వస్తి పలికిన నేపథ్యంలో మరోమారు కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలపై మళ్లీ ప్రతాపం చూపుతూ.. జూలై తరువాత అత్యధిక కేసులు, మరణాలతో పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. అమెరికా, బ్రిటెన్, ఇటలీ, ఇంగ్లాండ్ సహా దాదాపు అన్ని దేశాల్లోనూ మళ్లీ పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇంగ్లండ్‌లో గత వారం రోజులుగా సగటున 45 వేల కేసులు నమోదయ్యాయి. ఇక సోమ, బుధవారాల్లో ఏకంగా 49 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 3 లక్షల 11 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు గత వారంలో నమోదయ్యాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి పది లక్షల మందిలో ఏకంగా 4551 మందికి కరోనా ప్రభావానికి గురయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా ధర్డ్ వేవ్ నుంచి రక్షణ కోసం ఇచ్చిన కరోనా టీకాలు కూడా థర్డ్ వేవ్ పై అంతగా ప్రభావం చూపలేదని అరోగ్య నిపుణులు నిట్టూర్పుస్తున్నారు. గత వారంరోజుల్లో 908 మరణాలు సంభవించాయని, అందులో మంగళవారం రోజున సంభవించిన 223 మరణాలు మార్చి నుంచి అత్యధికమని అన్నారు.

డెల్టా వేరియంట్‌లోని ఏవై 4.2 రకమే కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఈ రకం డెల్టా కంటే 15 శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది. రష్యాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ ప్రతి రోజు 33 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండగా, వెయ్యికిపైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 4.18 లక్షల మంది కరోనాకు బలయ్యారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, ఆంక్షలు లేకపోవడమే తాజా పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోనూ డెల్టా వేరియంట్‌లోని తాజా రకం విజృంభణ మొదలైంది. రాజధాని కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

అమెరికాలో రోజుకు 90 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐసీయూలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా బారినపడి పెద్ద వయసు వారు ఎక్కువగా మరణిస్తున్నారు. కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నా, మరణాలు పెరుగుతున్నా టీకా వేయించుకునేందుకు మాత్రం అమెకన్లు ఇంకా విముఖత చూపుతూనే ఉన్నారు. టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఏడుకోట్ల మంది కనీసం ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు. వీరివల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh