HC issues notices to state government on School fee hike స్కూల్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Telangana high court issues notices to state government on school fee regulatory mechanism

High Court, Fee regulatory mechanism, Telangana Government, Notices, School fees Hike, Chief Justice Satish Chandra Sharma, Justice Rajashekar Reddy, fee regulatory mechanism, private unaided schools, Hyderabad School Parents Association, K Venkat Sainath, Telangana

A Division Bench of the Telangana High Court comprising Chief Justice Satish Chandra Sharma and Justice A Rajashekar Reddy issued notices to the State government with regard to a Public Interest Litigation seeking to establish a fee regulatory mechanism for private unaided schools in the State.

స్కూల్ ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Posted: 10/20/2021 03:13 PM IST
Telangana high court issues notices to state government on school fee regulatory mechanism

విద్యార్థుల ఫీజుల్లో ఏడాదికి ఏడాది పెరుగుదల ఉన్నా ట్యూషన్ పీజుతో పాటు పలు రకాల ఫీజులు మోసి విద్యార్థులు తల్లిదండ్రులపై మోపడాన్ని హైకోర్టు అక్షేపించింది. అన్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూళ్లు చేయడాన్ని ఏవిధంగా కట్టడి చేస్తున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వివరణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకునికి, సీబీఎస్‌ఈకి, తెలంగాణలోని గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘానికి, స్వతంత్ర యాజమాన్య సంఘానికి నోటీసులు జారీచేసింది.

ఫీజుల నియంత్రణ విషయంలో హైదరాబాద్‌ సూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి కే వెంకట సాయినాథ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఫీజుల నియంత్రణకు యంత్రాంగమే లేదని, ప్రైవేట్‌ పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజు పేరుతో అడ్డగోలుగా ఇతర ఫీజులను కూడా వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఫీజులపై నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశాన్ని తమకు సమర్పించాలని న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది.

ఫీజులను నియంత్రించే అధికారిక వ్యవస్థ లేకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ట్యూషన్ ఫీజులతో పాటు పలు రకాల ఫీజులను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, అధికంగా వసూలు చేసిన ఫీజుల నుంచి 40% మొత్తంతో కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన కోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది.

ఇక తాజాగా తెలంగాణలోని గురుకుల విద్యాల‌యాల‌ను తెరిచేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల దృష్ట్యా రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభానికి అనుమ‌తిని ఇవ్వాలని ప్ర‌భుత్వం కోరింది. విద్యా సంస్థ‌ల్లో కొవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని ఏజీ ప్ర‌సాద్ తెలిపారు. గురుకులాల్లో ప్ర‌త్య‌క్ష‌, ఆన్ లైన్ బోధ‌న చేప‌ట్టాల‌ని కోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థ‌లు తెరిచేందుకు గ‌తంలో హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ, గురుకుల విద్యాల‌యాల ప్రారంభానికి అనుమ‌తి ఇవ్వ‌లేదు. తాము ఆదేశాలు జారీ చేసే వ‌ర‌కు గురుకులాల‌ను తెర‌వొద్ద‌ని కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles