Uttarakhand rains: Over 1,300 rescued from flood-affected state ఉత్తరాఖండ్ వర్షాలు: 47 మంది మృతి..

Uttarakhand rains 46 dead 11 missing cm dhami says massive damage across state

Uttarakhand Rains, Rain in Uttarakhand, Uttarakhand Weather, Uttarakhand Rain News, Cloudburst in Nainital, Uttarakhand floods, Uttarakhand landslides, Uttarakhand rain deaths, Uttarakhand landslide deaths, Uttarakhand flood deaths, Uttarakhand flood loss, Uttarakhand massive damage, Uttarakhand

The death toll due to the heavy rains in Uttarakhand rose to 46 on Wednesday, revised figures published by the state government showed. At least 11 people are missing. Chief Minister Pushkar Singh Dhami visited Kumaon, one of the worst-hit regions in the state, to take stock of the situation.

ఉత్తరాఖండ్ వర్షాలు: 47 మంది మృతి.. వేల మంది నిరాశ్రయులు

Posted: 10/20/2021 04:10 PM IST
Uttarakhand rains 46 dead 11 missing cm dhami says massive damage across state

ప్రకృతి ప్రకోపానికి దేవభూమి ఉత్తరాఖండ్‌ చిగురుటాకులా వణికిపోతోంది. మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఏకంగా 47 మంది అసువులు బాసారు. పదకోండు మంది గల్లంతుకాగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాల ధాటికి వరదలు కూడా ముంచెత్తడం.. మరోవైపు కొండ చరియలు విరిగిపటడం కూడా సంభవిస్తుండటంతో ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకోస్తుందో తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటివరకు ఏకంగా 1300 వందల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.

పాశ్చాత్య అవాంతరాలు, ఆగ్నేయ గాలుల కారణంగా కురిసిన అత్యంత భారీ వర్షాలతో పర్వతాల నుంచి మైదానాల వరకు పెను విధ్వంసం కలిగింది. ఈ క్రమంలో 100 సంవత్సరాల క్రితం నమోదైన రికార్డులూ బద్దలయ్యాయి. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. కుమావన్ ప్రాంతంలోని ముక్తేశ్వర్‌లో 107 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 18, 1914 న 254.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ముక్తేశ్వర్‌లో 340.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంపావత్‌లో 580 మి.మీ, నైనిటాల్‌లో 530 మి.మీ, జియోలికోట్ 490 మి.మీ, భీమ్‌టాల్ 400 మి.మీ, హల్ద్వానీలో 300 మి.మీ వర్షాపాతం రికార్డయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో 100 నుంచి 500 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.

వాతావరణ మార్పుల కారణంగా రికార్డు స్థాయిలో వర్షాన్ని చవిచూసిన తీవ్రంగా నష్టపోయిన కుమావన్ ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమయం పడుతుందని అన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్ల చోప్పున అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నివారణ చర్యలు చేపట్టేందుకు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇక వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చోప్పును పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles